'యురి'పై ప్ర‌ధాని ప్రశంస‌లు

Sat,January 12, 2019 08:08 AM

2016 సెప్టెంబర్‌ 18న జమ్ము కశ్మీర్ యురి సెక్టార్‌ లోని ఆర్మీ స్థావరంపై టెర్ర‌రిస్ట్‌లు ఎటాక్‌కి ప్ర‌తీకారంగా ఇండియ‌న్ ఆర్మీ సెప్టెంబ‌ర్ 29న సర్జిక‌ల్ స్ట్రైక్ జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌ర్జికల్ స్ట్రైక్ నేప‌థ్యంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య దార్ యురి అనే సినిమా చేశాడు. రొన్ని స్క్రూవాలా బేన‌ర్‌పై ఆర్ఎస్‌వీపీ నిర్మించిన ఈ చిత్రంలో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఆయ‌న స‌ర‌స‌న యామీ గౌత‌మ్ క‌థానాయిక‌గా న‌టించింది. చిత్రంలో విక్కీ కౌశ‌ల్‌.. పాకిస్థాన్ టెర్ర‌రిస్ట్‌ల‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేసే టీం క‌మాండ‌ర్ చీఫ్ పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేశాడు. తాజాగా విడుద‌లైన ఈచిత్రం అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ముఖ్యంగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ సినిమా చూసి ద‌ర్శ‌కుడితో పాటు చిత్ర బృందంపై ప్ర‌శంసలు కురిపించాడు. విక్కీ కౌశ‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి మోదీ ఫిదా కూడా అయిన‌ట్టు ద‌ర్శ‌కుడు ఆదిత్య దార్ తెలిపారు. దేశ ప్రధాని త‌మ సినిమాని ఇంత‌గా మెచ్చుకుంటుండ‌డంతో చిత్ర యూనిట్ అంతా చాలా గ‌ర్వంగా ఫీల‌వుతుంది. చిత్రంలో ప‌రేష్ అధికారి పాత్ర‌లో కనిపించ‌గా, యామి గౌత‌మ్ ఓ అధికారిణిగా క‌నిపిస్తుంది. క్రితి కుల్హ‌రీ, మోహిత్ రైనా, మ‌నీష్ చౌద‌ర్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

2440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles