అభిమానుల‌కి మ‌న్మ‌ధుడి బ‌ర్త్ డే గిఫ్ట్

Sun,June 18, 2017 12:13 PM
Narakasurudu first look revealed

త‌మిళ న‌వ మ‌న్మ‌ధుడు అర‌వింద్ స్వామి ఒక‌ప్పుడు హీరోగా అల‌రించగా ప్ర‌స్తుతం ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తూనే, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ లోను మెప్పిస్తున్నాడు. ఆ మ‌ధ్య తెలుగులో ధృవ అనే చిత్రంలో విల‌న్ గా న‌టించి మెప్పించాడు. అయితే అర‌వింద్ స్వామి ప్ర‌ధాన పాత్ర‌లో ధృవంగ‌ల్ 16 అనే బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన కార్తీక్ న‌రేన్ ఇప్పుడు న‌ర‌గ‌సూర‌న్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల‌లో విడుద‌ల కానుంది. సందీప్ కిష‌న్, శ్రేయా శ‌రణ్ మ‌రియు ఇంద్ర‌జిత్ సుకుమార‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొంద‌నున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ ఎండింగ్ లో కాని లేదంటే సెప్టెంబ‌ర్ లో కాని సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ రోజు అరవింద్ స్వామి బ‌ర్త్ డే కాగా, ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తూ తెలుగు టైటిల్ ఫిక్స్ చేసింది . త‌మిళంలో న‌ర‌గ‌సూర‌న్ టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తెలుగులో న‌ర‌కాసురుడు టైటిల్ తో రూపొంద‌నుంది. ఈ చిత్రంలో మొదట సందీప్ ప్లేస్ లో చైతూని అనుకున్నప్పటికి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సందీప్ కిష‌న్ ని తీసుకున్నార‌ని టాక్. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని గౌతమ్‌ మేనన్‌ నిర్మిస్తున్నారు

1661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS