అంచ‌నాలు పెంచుతున్న టీజ‌ర్‌

Sun,November 26, 2017 12:22 PM
Naragasooran  Official Teaser released

అరవింద్ స్వామి.. సందీప్ కిషన్.. శ్రీయ.. మరియు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం న‌ర‌గ‌సూర‌న్‌. తెలుగులో ఈ చిత్రం న‌ర‌కాసురుడు అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. కార్తిక్ నారేన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గౌత‌మ్ మీన‌న్ నిర్మిస్తున్నారు. థ్రిల్ల‌ర్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. ఎప్పుడో తను చేసిన తప్పుడు పనులన్నీ మానేసిన ఒక మాఫియా డాన్.. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ కి వస్తే ఏంటి పరిస్థితి అనే నేపథ్యంలో.. ఒక థ్రిల్లర్ తరహాలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టీజ‌ర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు విజువ‌ల్స్ అదిరిపోయాయి. వ‌చ్చే ఏడాది మొద‌ట్లో ఈ సినిమా విడుద‌ల కానుండ‌గా, తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఆ టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles