రోహిత్ తుంటరితనం ఎక్కువైందా

Fri,January 29, 2016 04:40 PM
Nara Rohits Tuntari  FIRST LOOK Poster

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఒకేసారి ఆరేడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్ళగా ప్రస్తుతం ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నట్టు సమాచారం. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే ఇలాంటి సాహసాలను చేయగా, ప్రస్తుతం నారా రోహిత్ కూడా అదే రూట్‌ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.

నారా రోహిత్ నటిస్తోన్న తాజా చిత్రం తుంటరికు సంబంధించి ఇంతవరకు ఒక్కపోస్టర్ కూడా విడుదల కాకకపోగా, లేటెస్ట్‌గా ఓ టీజర్‌ని విడుదల చేసారు. తుంటరి చిత్రం కుమార్ నాగేంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతుండగా, విడుదలైన టీజర్‌లో రోహిత్ అదరగొట్టేసారు. తుంటరి సినిమా మాన్ కరాటే అనే చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతుండగా, ఈ చిత్రంలో రోహిత్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఇతనని ఢీ కొట్టే పాత్రలో కబీర్ దుహన్ సింగ్ కనిపిస్తున్నారు. విడుదలైన టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉండగా, ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. తుంటరోడు సీరియస్‌గా వచ్చిన ఆ టీజర్‌పై మరి మీరు ఓ లుక్కేయండి.

2956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles