షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పిన నారా రోహిత్

Wed,March 28, 2018 10:56 AM
Nara Rohith and Jagapathi Babu Aatagallu shooting completed

గ‌త ఏడాది వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నారా రోహిత్ ఈ ఏడాది కూడా డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన‌ ఆట‌గాళ్ళు అనే చిత్రాన్ని ప‌రుచూరి ముర‌ళి డైరెక్ట్ చేశాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ద‌ర్శ‌న బ‌నిక్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు. కొద్ది రోజులుగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం రీసెంట్‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఇక‌ మేక‌ర్స్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేసి స‌మ్మ‌ర్ త‌ర్వాత రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ఆ మ‌ధ్య ఆట‌గాళ్ళు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో నారా రోహిత్‌, జ‌గ‌ప‌తి బాబు లుక్స్ అభిమానుల‌ని ఆక‌ట్టుకున్నాయి. సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే నారా రోహిత్ ప్ర‌స్తుతం తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఆట‌నాదే వేట‌నాదే అనే చిత్రంతో పాటు శ‌బ్ధం అనే మూవీతో బిజీగా ఉన్నాడు.

1752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS