'ఆట‌గాళ్ళు' మొద‌లు పెట్టేశారు

Wed,December 13, 2017 02:33 PM
Nara Rohit Aatagaallu shoot starts from today

ఈ ఏడాది ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవ‌రంటే నారా రోహిత్ అని ఠ‌క్కున చెప్పేయోచ్చు. అటు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తిబాబుతో క‌లిసి ఆట‌గాళ్ళు అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. అక్టోబ‌ర్‌లో ఈ మూవీ లాంచ్ కాగా, నేటి నుండి చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఆంధ్రుడు ఫేం ప‌రుచూరి ముర‌ళీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేష‌న్స్ బేన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. విజ‌య్ సీ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రం అభిమానుల అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టు ఉంటుంద‌ని టీం చెబుతుంది.


1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS