'న‌న్ను దోచుకుందువ‌టే' ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ విడుద‌ల‌

Fri,August 10, 2018 11:26 AM
Nannu Dochukunduvate  song released

స‌మ్మోహ‌నం చిత్రంతో బిగ్గెస్ట్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు ప్ర‌స్తుతం నన్ను దోచుకుందువ‌టే చిత్రంతో బిజీగా సంగ‌తి తెలిసిందే. ఆర్ ఎస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో న‌న్ను దోచుకుందువటే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవ‌ల‌ చిత్ర ఫ‌స్ట్ లుక్ , టీజ‌ర్‌ విడుద‌లైంది.ఇది అభిమానుల‌ని అల‌రించింది. చిత్రంలో సుధీర్ బాబు కాస్త డిఫ‌రెంట్ మెంటాలిటీ ఉన్న మేనేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, హీరోయిన్ న‌బా న‌టేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించనుంది. కీలక పాత్రల్లో నాజర్‌, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు . ఇటీవ‌ల సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్ స్థాపించిన సుధీర్ బాబు త‌న నిర్మాణ సంస్థ‌లో తొలి చిత్రంగా నన్ను దోచుకుందువ‌టే సినిమా చేస్తున్నాడు. తాజాగా చిత్రానికి సంబంధించి మౌనం మాట‌తోటి అనే తొలి సాంగ్ విడుద‌ల చేశారు. లోక్‌నాధ్ పాడిన ఈ పాట‌కి శ్రీమ‌ణి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. మ‌రి ఈ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.

1299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles