న‌న్ను దోచుకుందువ‌టే వీడియో సాంగ్ ప్రోమో

Sun,September 16, 2018 07:50 AM

స‌మ్మోహ‌నం చిత్రంతో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం నన్ను దోచుకుందువ‌టే . ఆర్ ఎస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా , ప్ర‌మోష‌న్స్ విష‌యంలో స్పీడ్ పెంచారు మేకర్స్. చిత్రంలో సుధీర్ బాబు కాస్త డిఫ‌రెంట్ మెంటాలిటీ ఉన్న మేనేజ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, హీరోయిన్ న‌బా న‌టేష్ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా క‌నిపించనుంది. కీలక పాత్రల్లో నాజర్‌, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు . ఇటీవ‌ల సొంత ప్రొడ‌క్ష‌న్ హౌజ్ స్థాపించిన సుధీర్ బాబు త‌న నిర్మాణ సంస్థ‌లో తొలి చిత్రంగా నన్ను దోచుకుందువ‌టే సినిమా చేసాడు. చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్స్‌,సాంగ్స్ , టీజ‌ర్స్ , ట్రైల‌ర్ అల‌రించాయి. తాజాగా చిత్రానికి సంబంధించి మౌనం మాట‌తోటి అనే సాంగ్ ప్రోమో విడియో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. మీరు వీడియోపై ఓ లుక్కేయండి.


1870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles