మ‌ళ్ళీ కౌశ‌ల్‌నే టార్గెట్ చేసిన హౌజ్‌మేట్స్‌

Tue,September 25, 2018 08:44 AM
Nannu Dochukunduvate Cast in bigg boss house

బిగ్ బాస్ సీజ‌న్ 2 .. 107 మార్క్‌కి చేరుకుంది. మ‌రో ఐదు రోజుల‌లో టైటిల్ విజేత ఎవ‌రో తెలిసిపోతుంది. గ‌త‌వారం గొడ‌వ‌ల‌తో హౌజ్‌లో హీట్ పుట్టించిన ఇంటి స‌భ్యులు ఈ వారం మాత్రం చాలా కూల్‌గా, స‌ర‌దాగా ఉండాల‌ని భావించారు. కాని బిగ్ బాస్ వారికి ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. సోమ‌వారం రోజు ప్ర‌సార‌మైన 107వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఓ అనౌన్స్‌మెంట్ చేశారు. ఫినాలేకి వెళ్లిన మీ ఐదుగురిలో ఫైనల్‌లో మీతో పాటు ఎవరు ఉండాలనుకుంటున్నారు.. ఎవరు ఉండకూడదనుకుంటున్నారో తెలియజేస్తూ.. బోర్డ్ పై ఉంచిన ఫోటోలు ఎదురుగా ఇష్టమైన వ్యక్తి ఎదురుగా హార్ట్ సింబల్ పెట్టాలని.. అలానే ఇష్టంలేని వ్యక్తి ఎదురుగా డిస్ లైక్ సింబల్ పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో మ‌రోసారి అంద‌రి టార్గెట్ కౌశ‌ల్ అయ్యాడు.

బిగ్ బాస్ సీజ‌న్ 2 లో కొద్ది రోజుల నుండి టాస్క్‌ల‌న్నీ కౌశ‌ల్ వ‌ర్సెస్ ఇంటి స‌భ్యుల‌ వ‌లే సాగింది. కౌశ‌ల్ త‌న గేమ్ తాను ఆడుతుండ‌గా, మిగ‌తా ఇంటి స‌భ్యులు ఒక్క‌టై కౌశ‌ల్‌ని ఓడించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేశారు. ఇప్పుడు ఫైన‌ల్‌లోను త‌మ‌తో పాటు కౌశ‌ల్ ఉండ‌కూడ‌ద‌నే విష‌యాన్ని బ‌హిర్గతం చేశారు. బిగ్ బాస్ చెప్పిన‌ట్టుగా బోర్డ్‌పై ఉన్నఫోటోల ఎదురుగా హార్డ్ సింబ‌ల్‌తో పాటు డిస్‌లైక్ సింబ‌ల్ పెట్టే క్ర‌మంలో ముందుగా త‌నీష్ .. త‌న‌తో పాటు ఫైన‌ల్‌లో సామ్రాట్ ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపాడు. సామ్రాట్ అంటే త‌న‌కి ఇష్టం కార‌ణంగా అత‌నే ఫైన‌ల్‌లో ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు తనీష్ అన్నాడు. ఇక కౌశ‌ల్ ఫోటోకి ఎదురుగా డిస్‌లైక్ ఉంచిన త‌నీష్‌.. ఆదివారం ఎపిసోడ్ మీరు మాట్లాడిన మాట‌లు కొంచెం నెగెటివ్‌గా అనిపించాయి. ఈ క్ర‌మంలో మిమ్మ‌ల్ని ఫైన‌ల్‌లో చూడ‌ల‌నుకోవ‌డం లేదంటూ త‌నీష్ అన్నాడు.

దీప్తి న‌ల్ల‌మోతు మాట్లాడుతూ.. త‌న‌తో పాటు ఫైన‌ల్‌లో గీతాని చూడాల‌నుకుంటున్న‌ట్టు తెలిపింది. మిమ్న‌ల్ని టార్గెట్ చేస్తున్నార‌న్న కార‌ణంతో మీరు మాకు దూరంగా ఉంటూ వ‌చ్చారు. అందుకే డిస్‌లైక్ మీకు ఇస్తున్నాను అని కౌశ‌ల్ ఫోటో ముందు డిస్‌లైక్ ఫోటో పెట్టింది దీప్తి. ఇక కౌశ‌ల్ మాట్లాడుతూ.. త‌నకి ఉన్న పాపులారిటి, ఫ్యాన్స్ పరంగా చూస్తే నాతో పాటు ఫైన‌ల్‌లో ఉండే ఛాన్స్ గీతాకి ఉంద‌ని చెప్పాడు. ఇక మిగ‌తా వారి క‌న్నా కాస్త వీక్ సామ్రాట్ అని భావిస్తుండ‌డంతో అత‌ని డిస్‌లైక్ ఇస్తున్నానని కౌశ‌ల్ చెప్పుకొచ్చాడు. .

గీతా మాధురి మాట్లాడుతూ.. త‌న‌తో పాటు దీప్తి న‌ల్లమోతు ఫైన‌ల్‌లో ఉండాల‌ని కోరుకుంటున్నాను. త‌న‌ని ద‌గ్గ‌ర నుండి చూశాను కాబ‌ట్టి నేను ఈ నిర్ణ‌యం చెబుతున్నాను అని అంది. నా మార్గానికి కాస్త డిఫ‌రెంట్‌గా ఉంది కౌశ‌ల్ కాబ‌ట్టి అత‌ను నాతో పాటు ఫైన‌ల్‌లో ఉండ‌కూడ‌ద‌ని భావిస్తున్నాను అని గీతా పేర్కొంది. ఇక త‌న‌తో పాటు ఫైన‌ల్‌లో త‌నీష్ ఉండాల‌ని సామ్రాట్ చెప్పుకొచ్చాడు. నాకు రాక‌పోయిన త‌నీష్‌కి టైటిల్‌ వ‌స్తే చాల‌ని కోరుకుంటున్నాను అని సామ్ అన్నాడు. వేట‌గాడు చెప్పిన క‌థ మాకు న‌చ్చ‌ని కార‌ణంగా కౌశ‌ల్‌కి డిస్ లైక్ ఇస్తున్నానంటూ సామ్రాట్ చెప్పాడు. ఆ త‌ర్వాత ప‌లు విష‌యాల గురించి ఇంటి స‌భ్యులు చ‌ర్చిస్తున్న క్ర‌మంలో కన్ఫెష‌న్ రూంలో న‌న్ను దోచుకుందువ‌టే టీం ప్ర‌త్య‌క్ష‌మైంది.

సుధీర్ బాబు, కన్నడ భామ నభా నతేష్‌లు సినిమా విష‌యాల‌ని చెబుతూ ప‌లు టాస్క్‌లు ఆడారు. మీకు బిగ్ బాస్ ఎలాగో నేను సినిమాలో బిగ్ బాస్ అని సుధీర్ ఇంటి స‌భ్యుల‌తో చెప్పుకొచ్చాడు. ఇక ప్ర‌పోజల్ ఎన్ని ర‌కాలుగా చేయోచ్చో అన్ని ర‌కాలుగా ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి చేసి చూపించారు నన్ను దోచుకుందువ‌టే టీం . ఆ త‌ర్వాత స‌ర‌దా విష‌యాల‌ని ముచ్చ‌టిస్తున్న‌ క్ర‌మంలో ఇంటి నుండి వెళ్ళే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో సుధీర్, న‌బా ఇంటిని వీడారు . ఆ త‌ర్వాత గీతా మాధురి, దీప్తి నల్లమోతు, సామ్రాట్‌లు కౌశ‌ల్ గురించి ప్ర‌స్తావించారు. త‌ను మ‌న‌ల్ని ఎలా డిసైడ్ చేస్తాడ‌ని సామ్రాట్ అన‌గా, ఎంత నేక్‌గా క‌ట్ చేస్తున్నాడో మీకు అర్ధ‌మ‌వుతందా అని గీత .. దీప్తి, సామ్రాట్‌ల‌తో చెబుతుంది. దీంతో 107వ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ ప‌డింది.

5662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles