చివరి దశకు చేరుకున్న ఎన్టీఆర్ చిత్రం

Thu,December 17, 2015 06:49 PM
nannaku prematho unit busy with post productions

జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు యూనిట్ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తోంది. ఇటీవలే
స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చిన టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పై ఫుల్ ఇంట్రెస్ట్ పెడుతోంది. స్పెయిన్ షెడ్యూల్‌తో దాదాపు టాకీ పార్ట్ పూర్తి కాగా , మిగిలి ఉన్న ఓ సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోలో తెరకెకక్కించనున్నట్టు తెలుస్తోంది.

ఒకవైపు మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్‌ను త్వరగా పూర్తి చేసుకుంటున్న చిత్ర యూనిట్ డబ్బింగ్ పనులను కూడా ముమ్మరం చేస్తుంది. ప్రస్తుతం రకుల్ తన పార్ట్‌కు సంబంధించిన డబ్బింగ్‌ని శబ్ధాలయా స్టూడియోలో చెబుతుండగా, ఎన్టీఆర్ బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్ తర్వాత తన పార్ట్‌కు డబ్బింగ్ చెప్పనున్నారు.ఇక ఈ చిత్ర ఆడియో వేడుకను డిసెంబర్ చివరి వారంలో లేదంటే జనవరి మొదటి వారంలో జరపనున్నట్టు సమాచారం.

1440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles