మ‌ల్టీ స్టారర్‌లో ఎంపికైన ఇద్దరు యువ హీరోలు.!

Tue,July 17, 2018 10:27 AM
nani,Sharwanand plays main roles in new multistarrer

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు తెర‌కెక్కుతుండ‌గా, ఇటీవ‌ల మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించ‌నుండ‌గా, ఇటీవల ‘సమ్మోహనం’ చిత్రం తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరోలుగా ఎవ‌రు న‌టిస్తార‌ని అభిమానుల‌లో అనేక అనుమానాలు తలెత్త‌గా, యువ హీరోలు శ‌ర్వానంద్‌, నాని న‌టిస్తార‌ని చిత్ర వ‌ర్గాల నుండి స‌మాచారం అందుతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ త్వ‌ర‌లోనే రానుంది.

నాని ప్ర‌స్తుతం నాగ్‌తో దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టారర్ చిత్రం చేస్తుండ‌గా, శ‌ర్వానంద్.. న‌రేష్‌తో క‌లిసి గ‌మ్యం, నువ్వా నేనా వంటి మల్టీ స్టార‌ర్ చిత్రాలు చేసాడు. మ‌రి తాజా కాంబినేష‌న్‌పై ఆస‌క్తి నెల‌కొంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ మల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌ని ఇంద్ర‌గంటి తెర‌కెక్కించ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం తెలుగులో నాగార్జున‌-నాని కాంబినేష‌న్‌లో దేవదాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, వెంకీ- వ‌రుణ్‌తేజ్ క‌లిసి ఎఫ్‌2 అనే చిత్రాన్ని చేస్తున్నారు. బాబీ కూడా వెంకీ- నాగ చైత‌న్య కాంబోలో ఓ మ‌ల్టీ స్టార‌ర్ రూపొందిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఇక మ‌హేష్‌- అల్ల‌రి న‌రేష్ కాంబోలో ఓ మ‌ల్టీ స్టార‌ర్ మూవీ, నారా రోహిత్‌, శ్రీ విష్ణు, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో వీర భోగ వ‌సంత రాయ‌లు అనే చిత్రాలు ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్నాయి. త్వరలో ఎన్టీఆర్ -రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కించనున్నాడు.

2147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles