నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది..

Mon,July 15, 2019 05:30 PM
Nanis Gangleader firstlook revealed today

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఐదుగురు మహిళలు కళ్లకు బైనాక్యులర్‌ పెట్టుకుని చూస్తుండగా..నాని మాత్రం బైనాక్యులర్‌ను చేతిలో పట్టుకుని ఉన్న లుక్‌ ఆసక్తికరంగా ఉంది. తాజాగా విడుదల ఫస్ట్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రీ లుక్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్యాంగ్‌ లీడర్‌ మొదటి సాంగ్ ను జులై 18న, జులై 24న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. 24వ చిత్రంగా వస్తోన్న ఈ ప్రాజెక్టులో ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ విలన్‌గా కనిపించబోతున్నాడు.

1282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles