చిన్న పాప‌లా మా అమ్మ ఫోటోకి ఫోజిచ్చింది: నాని

Tue,October 15, 2019 11:47 AM

నేచుర‌ల్ స్టార్ నాని సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. త‌న వ‌ర్క్ విష‌యాల‌తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన విష‌యాల‌ని కూడా అప్పుడ‌ప్పుడు నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటాడు . గ‌త ఏడాది మార్చిలో తొలిసారిగా త‌న త‌ల్లిని ప‌రిచ‌యం చేశాడు నాని . త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మీ 30 ఏళ్ళుగా ఫార్మసిస్ట్‌గా ప‌నిచేస్తూ ప‌దవీ విర‌మ‌ణ చేస్తున్న సంద‌ర్భంగా తల్లితో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ. . 30 ఏళ్ళుగా ఫార్మ‌సిస్ట్‌గా ప‌ని చేశారు. ఎప్పుడు న‌వ్వుతూ సాయం చేయ‌డానికి ముందుంటారు. వైద్యులు ఆమెని ఇష్ట‌ప‌డ‌తారు. రోగులు అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఆమెని లైక్ చేస్తారు. మేము మ‌రింత‌గా ప్రేమిస్తా.. ఈ రోజు చివ‌రి వ‌ర్కింగ్ డే.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంద‌మ్మా అని ట్వీట్ చేశాడు నాని.


అక్టోబ‌ర్ 14న త‌న త‌ల్లి బ‌ర్త్ డే కావ‌డంతో ఆమె ఫోటో పోస్ట్ చేసి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు నాని . ఈ అమ్మే మా అమ్మ అంటూ అందరికీ సరికొత్తగా పరిచయం చేశారు. ఫోటో అనగానే వినయంగా యూనిట్ టెస్ట్ లో ఫస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ లాగా...కొత్త బట్టలు వేసుకున్న చిన్న పాప లాగా బిగుసుకుపోయిన ఈ అమ్మ మా అమ్మ .. మా ఇంటికి అమ్మ .. హ్యాపీ బ‌ర్త్‌డే అమ్మ‌.. ల‌వ్ యూ సోమచ్ అంటూ కామెంట్ పెట్టాడు. రీసెంట్‌గా గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నాని ప్ర‌స్తుతం వి అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు కూడా హీరో పాత్ర పోషిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావు హీరోయిన్లు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

14586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles