వెంకటేష్‌ తో నటిస్తే బాగుంటుందన్నారు..

Mon,April 15, 2019 10:41 PM
nani wants to act with venkatesh

వెంకటేష్‌ అవకాయ లాంటి వారు. ఆయనను ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరని అన్నాడు న్యాచురల్ స్టార్ నాని. హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకలో నాని మాట్లాడుతూ..బిగ్‌ స్క్రీన్‌పై చూసి వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చిన ఏకైక స్టార్‌ వెంకటేష్‌. ఆయన నా సినిమా వేడుక రావాలనే కోరిక ఈ ‘జెర్సీ’తో తీరింది. ఇద్దరం కలిసి నటించి ఒకే వేదికను పంచుకోవాలనే కోరిక నా మనసులో ఇంకా బలంగా అలాగే ఉంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను.

మల్టీస్టారర్‌ టాపిక్‌ ఎప్పుడు వచ్చినా నేను వెంకటేష్‌ కలిసి నటిస్తే బాగుంటుందని చాలా మంది చెప్పారు. ఏప్రిల్‌ 19న నాతో పాటు మా టీమ్‌ను చూసి ప్రతి ఒక్కరూ గర్వపడతారు. అందరూ గర్వించే సినిమాలో నేను భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. బ్లాక్‌బాస్టర్‌ సినిమా లాంటి మాటలు చెప్పాలనిపించడంలేదు. మంచి సినిమా పక్కన అలాంటి పదాలు పెట్టను. గొప్ప సినిమా చేశానన్న సంతృప్తి ఉంది. దర్శకుడు గౌతమ్‌ ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. గౌతమ్‌ ఈ వేదికపై లేకపోయినా అతడి సినిమా మాట్లాడుతుంది. సంగీతం, ఎడిటింగ్‌, కెమెరా, నటీనటులు అందరూ కథ చెప్పడంలో ఓ భాగం అయ్యారు. అందమైన సినిమా చేశానన్న అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను’అని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్‌వర్మ, మారుతి తదితరులు పాల్గొన్నారు.

1927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles