తాప్సీ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేయ‌నున్న నాని

Tue,May 22, 2018 11:09 AM
nani unveils the title of new movie

ట్రిపుల్ హ్యాట్రిక్‌ని తృటిలో చేజార్చుకున్న నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీ స్టార‌ర్‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి కొద్ది రోజుల‌లో బిగ్ బాస్ 2 కార్య‌క్ర‌మం ద్వారా బుల్లితెర‌కి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు . అయితే ఈ హీరో మే 24వ తేదీన ఉద‌యం 11గంట‌ల 11 నిమిషాల‌కి మూవీ టైటిల్ అనౌన్స్ చేయ‌నున్నాడు. నానితో నిన్ను కోరి అనే సినిమా తీసిన కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప్ర‌స్తుతం ఎమ్‌వీవీ సినిమాస్‌తో క‌లిసి ఓ చిత్రం చేస్తుంది. ఇందులో ఆది పినిశెట్టి, తాప్సీ, గురు ఫేం రితికా సింగ్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.ఈ చిత్ర టైటిల్‌ని నాని చేత ప్ర‌క‌టింప‌జేయాల‌ని అనుకున్నారు మేక‌ర్స్‌. అందుకు సంబంధించి పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఈ సినిమా అభిమానులు మెచ్చే చిత్రంగా ఉంటుంద‌ని వారు అంటున్నారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే రివీల్ చేయ‌నున్నారు. ‘లవర్స్‌’ ఫేమ్‌ హరి దర్శత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో ఆది పినిశెట్టి అంధుడిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌.


1785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles