ఎన్టీఆర్ రోల్‌లో న్యాచురల్‌స్టార్..?

Tue,January 23, 2018 10:47 PM
Nani to play as NTR in Biopic

హైదరాబాద్: అలనాటి అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా మహానటి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ లీడ్ రోల్ పోషిస్తోంది. సావిత్రి టాప్ హీరోలందరి సరసన నటించడంతో..ఇక ఈ సినిమాలో ఎవరి పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో న్యాచురల్ స్టార్ నాని కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై చిత్ర నిర్మాతలు ఇప్పటికే నానిని కూడా సంప్రదించగా.. అందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బయోపిక్‌లో జెమినీ గణేశన్ పాత్రలో దుల్హర్ సల్మాన్, జమునగా సమంత, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, అక్కినేని నాగేశ్వర్‌రావుగా విజయ్ దేవరకొండ, జానకిగా షాలిని పాండే, చక్రపాణిగా ప్రకాశ్‌రాజ్ నటించనున్నట్లు సమాచారం.

1757
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS