నాని స‌ర‌స‌న కమ‌ల్ గారాల పట్టి

Wed,June 20, 2018 09:38 AM
nani to pair with sruthi hassan

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో ఇటు తెలుగు అటు హిందీలో బిజీగా ఉండేది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్న ఈ అమ్మ‌డు చివరిగా కాట‌మ‌రాయుడు అనే చిత్రం చేసింది . ఇటీవ‌ల హిందీలో బెహెన్ హోగీ తేరీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది . త‌న తండ్రి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టించింది శృతి . ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక‌ రీసెంట్‌గా ఓ బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది శృతి హాస‌న్ . మ‌హేష్ మంజ్రేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్ట‌ర్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని టాక్‌. శృతికి జోడిగా విద్యుత్ జ‌మ్వాల్ న‌టిస్తున్నారు. విజయ్‌ గలానీ, ప్రతీక్‌ గలానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏడాది చివ‌రిలో రిలీజ్ కానున్న‌ట్టు స‌మాచారం.

ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో నాని జెర్సీ అనే టైటిల్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే . మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. ఇందులో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో క‌థానాయిక‌గా శృతి హాస‌న్‌ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపిన నిర్మాత‌లు త్వ‌ర‌లో దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోని చిత్రంలోను శృతి హాస‌న్ ఓ క‌థానాయిక‌గా ఉంద‌ని టాక్. ఇదిలా ఉండ‌గా ఆ మ‌ధ్య త‌న ప్రియుడు మైఖేల్ కోర్సెల్‌తో క‌లిసి చెట్టాపట్టాలు వేస్తూ ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలిచింది శృతి హాస‌న్.

3116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles