పాత్ర కోసం గంట‌ల పాటు శిక్ష‌ణ తీసుకుంటున్న నాని

Thu,September 27, 2018 09:20 AM
nani takes training for jersey role

నేచుర‌ల్ స్టార్ నాని ఇప్పుడు ఇటు వెండితెర‌పై అటు బుల్లితెర‌పై అల‌రిస్తున్నాడు. నాని న‌టించిన తాజా చిత్రం దేవ‌దాస్ నేడు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇందులో దాస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో నాని జెర్సీ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు . మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది . క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయోద్దు అని జెర్సీకి ట్యాగ్ లైన్‌గా ఉంచారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈచిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని రోజుకు 3గంటలు క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నాడట. క్రికెట‌ర్‌గానే కాదు పెళ్ల‌యిన న‌డివ‌య‌స్కుడు, ముస‌లి వ్య‌క్తిగా కూడా నాని ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. నాని మూడు పాత్ర‌ల‌ని ఛాలెంజ్‌గా తీసుకొని న‌టిస్తున్నాడ‌ని చెబుతున్నారు. న‌ట‌నకి ఆస్కారం ఉన్న ఈ మూడు పాత్ర‌ల‌తో నాని చేయ‌బోయే మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తుండ‌గా, నిత్యామీన‌న్‌ని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌.

2135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles