మూడు రోజులు.. మూడు గిఫ్ట్స్ అంటున్న నాని

Sat,January 13, 2018 12:21 PM
nani surprise coming soon

చూడటానికి ప్రక్కింటి అబ్బాయిలా ఉండే నాని తన నటనతో ప్రతి ఒక్కరికి చాలా దగ్గరయ్యాడు. సహజమైన నటనతో నేచురల్ స్టార్ గా మారాడు. డబుల్ హ్యట్రిక్ అందుకున్న నాని రీసెంట్గా ఎంసీఏ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కృష్ణార్జున యుద్ధం అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలోను ఓ డిఫరెంట్ ప్రాజెక్ట్ చేయనున్నట్టు టాక్. నాని, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం చిత్రం ఏప్రిల్ 12న గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండడంతో సంక్రాంతి సందర్భంగా అభిమానులకి మంచి గిఫ్ట్స్ ఇచ్చేందుకు నాని సిద్ధమయ్యాడు.
పండుగ మూడు రోజులు మూడు డిఫరెంట్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నట్టు వీడియో ద్వారా తెలిపాడు నాని. జనవరి 14 భోగి సందర్భంగా కృష్ణార్జున యుద్ధం చిత్రంలోని కృష్ణ పాత్ర ఫస్ట్ లుక్ ని, జనవరి 15 సంక్రాంతి రోజున అర్జున్ పాత్ర ఫస్ట్ లుక్, జనవరి 16 కనుమ రోజున మూవీలోని లిరికల్ వీడియోని విడుదల చేయనున్నామని నాని అన్నారు. శైన్ స్క్రీన్స్ పతాకంపై గరపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు. కృష్ణార్జున యుద్ధం చిత్రం కూడా నానికి మంచి విజయాన్ని అందిస్తుందని టీం భావిస్తుంది.1916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles