హిట్ కాదు.. మ‌న‌సు పెట్టి చేశాం: నాని

Sat,May 26, 2018 09:24 AM
nani shocking response on  Krishnarjuna Yuddham movie

నేచుర‌ల్ స్టార్ నాని ట్రిపుల్ హ్యాట్రిక్‌కి బ్రేక్ వేసిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయింది. సినిమా రిలీజ్ అయిన రోజే క‌లెక్ష‌న్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయంటే ఈ సినిమా జ‌నాల ఆద‌ర‌ణ‌కి ఏ మాత్రం నోచుకోలేదని అర్ధ‌మవుతుంది. ఇందులో పెంచ‌ల్ దాస్ పాడిన దారి చూడు దమ్మూ చూడు మామ.. సాంగ్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. హిప్ హాప్ త‌మీజా స‌మ‌కూర్చిన స్వ‌రాలు సంగీత ప్రియుల‌ని అల‌రించాయి. ఈ మూవీలో నాని కృష్ణ అనే పాత్ర‌లో మాస్ లుక్‌తో క‌నిపించ‌గా, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా క‌నిపించాడు. రెండు పాత్ర‌ల‌లో నాని త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టిన క‌థ కొంచెం సైడ్ ట్రాక్‌కి వెళ్ల‌డంతో ఈ సినిమా ప్రేక్షకాద‌ర‌ణ పొంద‌లేక‌పోయింది. అయితే యూప్ టీవీ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా .. నాని సూప‌ర్ హిట్ చిత్రం కృష్ణార్జున యుద్ధం సినిమాని మా డిజిట‌ల్ కంటెంట్‌లో చూడండి అని పేర్కొంది. దీనికి స్పందించిన నాని..సూప‌ర్ హిట్ అంట‌.. అవ్వ‌లేదు బాబాయ్, ఆడ‌లేదు కూడా.. కాని మ‌న‌సు పెట్టి చేశాం.. చూసేయండి అని త‌న ట్వీట్‌లో తెలిపాడు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రించిన కృష్ణార్జున యుద్ధం చిత్రంలో క‌థానాయిక‌లుగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్‌ నటించిన విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌ల్టీస్టారర్ తో బిజీగా ఉన్నాడు. ఇందులో నాగ్ కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.54
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles