త‌న‌యుడి ఫోటో షేర్ చేసి విషెస్ చెప్పిన నాని

Tue,November 14, 2017 02:56 PM
nani shares his sons pic

నేచురల్ స్టార్ స్టార్ నాని ఈ ఏడాది మార్చి 29న‌ తండ్రి ప్రమోషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 2న తొలిసారి త‌న త‌న‌యుడిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన నాని ఆ త‌ర్వాత కొద్ది సార్లు మాత్ర‌మే త‌న‌యుడితో క‌లిసి దిగిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ రోజు బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న త‌న‌యుడితో దిగిన ఓ అంద‌మైన ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ పిల్ల‌లంద‌రికి హ్య‌పీ చిల్డ్ర‌న్స్ డే విషెస్ తెలిపాడు. త‌న కుమారుడు నాని చూపుడు వేలు గ‌ట్టిగా ప‌ట్టుకోగా, అది చూసి నాని తెగ మురిసిపోతున్న‌ట్టు పిక్‌లో కనిపిస్తుంది. ఈ పిక్‌కి అభిమానులు ప‌లు ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు జూనియ‌ర్ నేచుర‌ల్ స్టార్ అంటుంటే మ‌రి కొంద‌రు నాని 2.0 అంటున్నారు. నాని ప్ర‌స్తుతం ఎంసీఏ చిత్రంతో పాటు కృష్ణార్జున యుద్ధం సినిమాలు చేస్తున్నాడు. ఎంసీఏ చిత్రం వేణు శ్రీరామ్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, కృష్ణార్జున యుద్ధం మూవీని మేర్ల‌పాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీల త‌ర్వాత హను రాఘ‌వ‌పూడితో నాని ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.2724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS