కౌశ‌ల్‌,త‌నీష్‌ల‌కి క్లాస్ పీకిన నాని.. నామినేష‌న్‌లో ఆ ముగ్గురు

Sun,August 19, 2018 07:40 AM
nani serious on kaushal, tanish

శ‌నివారం వ‌చ్చిందంటే ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి నాని చేసే సంద‌డి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. శ‌నివారం ఎపిసోడ్‌తో బిగ్ బాస్ సీజ‌న్ 2 స‌క్సెస్‌ఫుల్‌గా ప‌ది వారాలు పూర్తి చేసుకుంది. ప్ర‌తి వారం పిట్ట క‌థ చెప్పే నాని ఈ సారి ఓ సామెత చెప్పారు. ఆ తర్వాత జ‌ల విల‌యం వ‌ల‌న కేర‌ళ ప్ర‌జ‌లు ఎంత‌గా విల‌విలలాడుతున్నారో తెలియ‌జేస్తూ వారికి ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు సాయం అందించాల‌ని కోరారు. ఇక ఎప్ప‌టి లాగానే శుక్ర‌వారం హౌజ్‌లో ఏం జరిగిందో నా....ని... టీవీ ద్వారా చూపించారు నాని. శుక్ర‌వారం రోజు ఇంటి స‌భ్యుల‌కి ‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్.. మిస్టర్ హ్యాండ్సమ్’ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్ర‌కారం ఇంట్లో ఉన్న అబ్బాయిలు న్యాయ నిర్ణేత‌లుగా ఉన్న అమ్మాయిల‌ని ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం టిప్‌టాప్‌గా త‌యారైన అబ్బాయిలు ఒక్కొక్క‌రిగా ర్యాంప్ వాక్ చేసుకుంటూ, అలాగే న్యాయ‌నిర్ణేత‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కి త‌మ‌దైన స్టైల్‌లో స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రి స్టైల్‌లో వారు త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చి టాస్క్ ముగించారు. అయితే ఈ టాస్క్‌లో అంద‌రికంటే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌ర‌చిన సామ్రాట్‌ని మిస్టర్ హ్యాండ్సమ్ విన్నర్‌గా ప్రకటించారు మహిళా కంటెస్టెంట్స్. అంతేకాదు ఆయ‌నకి ల‌క్ష రూపాయ‌ల చెక్కు కూడా అందించారు. ఇక నానితో మాట్లాడే ముందు ఇంటి స‌భ్యులు అంద‌రు వాజ్‌పేయి మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఆ త‌ర్వాత య‌దావిదిగా నానితో హౌజ్‌మేట్స్ సంద‌డి షురూ అయింది

ప‌డ‌గొట్టు .. నిల‌బెట్టు టాస్క్‌లో గాయ‌ప‌డ్డ నూత‌న్ నాయుడు హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనే విష‌యంపై బిగ్ బాస్ నిర్ణ‌యం తీసుకుంటారని చెప్పిన నాని మాజీ కెప్టెన్ త‌నీష్‌కి చిన్న పాటి క్లాస్ పీకారు. గ‌త‌వారం కెప్టెన్‌గా ఉన్న నువ్వు నీ బాధ్య‌త‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌క‌పోగా, బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల‌ని బేఖాత‌రు చేసావ‌ని అన్నారు. అంతేకాదు ఎలిమినేష‌న్ సుమ‌యంలో సున‌య‌న‌, శ్యామ‌ల ఇద్దరిలో ఒక‌రిని నామినేష‌న్‌కి ఎంపిక చేయాల్సిన స‌మ‌యంలో దూరంగా ఉండ‌డం ఏం బాగోలేద‌ని చుర‌క‌లు అంటించారు . అయితే 70వ ఎపిసోడ్‌లో నాని ఒక‌వైపు చీవాట్లు పెడుతూనే మ‌రో వైపు ఇంటి స‌భ్యుల‌తో ర్యాపిడ్ ఫైర్ ఆడించాడు

ఇక కౌశ‌ల్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన నాని.. బిగ్ బాస్ కాల్ సెంట‌ర్ టాస్క్‌లో నువ్వు ప్ర‌ద‌ర్శించిన స‌హ‌నానికి హ్యాట్సాఫ్ అన్నారు. నిన్ను ఎక్కువ‌గా ఏ కాల‌ర్ విసిగించార‌ని కౌశల్‌ని నాని అడ‌గ‌గా గ‌ణేష్ అని చెప్పాడు. ఇక సున‌య‌న త‌న క‌న్నా పెద్ద‌వాడినైన నాపై దుర్బాష‌ణ‌లు చేయ‌డం న‌చ్చ‌లేదని, కాక‌పోతే అది టాస్క్ లో భాగం క‌దా అని సైలెంట్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు కౌశ‌ల్‌. అయితే తాను ఏకాకినంటూ ప‌దేప‌దే చెప్పుకోవ‌డంపై నాని ఆగ్ర‌హం వ్యక్తం చేశాడు. నిన్ను టార్గెట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే లేరు. నీకు మొద‌ట స‌పోర్టివ్‌గా ఉన్న బాబు గోగినేని, పూజా రామ‌చంద్ర‌న్‌, గీతా మాధురిలు నీకు రివ‌ర్స్ అయ్యారంటే ఎక్క‌డో కాస్త తేడా వ‌స్తున్న‌ట్టు అనిపించ‌డం లేదా? మొన్న టాస్క్‌లో వాష్ రూంకి వెళ్ళాల్సొచ్చిన స‌మ‌యంలో నీ తోటి స‌భ్యులు నీకు ఎంత సాయం చేశారో గుర్తు లేదా అంటూ కౌశ‌ల్‌ని ప్ర‌శ్నించాడు.

హౌస్ మేట్స్‌తో ఫ్రెండ్ షిప్ కావాలని కోరుకుంటున్నావ్ కాని నీ ప్రవర్తనలో అది కనిపించలేదు. నీ ఆలోచనలు బాగున్నాయ్. కాని ప్రజెంట్ చేసే విధానం బాగోలేదంటూ కౌశ‌ల్‌కి హితవు పలికారు నాని. ఇప్ప‌టికైన కొంచెం నీ ప్ర‌వ‌ర్త‌న మార్చుకొని అంద‌రితో హ్యాపీగా ఉంటూ ఇంట్లో స‌హృద్భావ వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా చేస్తార‌ని భావిస్తున్నాను అంటూ నాని తెలిపారు. ఇక మిగ‌తా ఇంటి స‌భ్యుల‌తో స‌ర‌దాగా మాట్లాడిన నాని ర్యాపిడ్ ఫైర్‌లో వైరైటీ ప్ర‌శ్న‌ల‌తో ఇంటి స‌భ్యుల‌ని తెగ ఇబ్బంది పెట్టేశాడు. ఎక్కువ మంది దీప్తి సున‌య‌న‌కి లేజీ, డంబ్ అనే బిరుదులు ఇచ్చారు. ఇక ఈ వారం ఎలిమినేష‌న్‌లో గీతా మాధురి, శ్యామల, రోల్ రైడా, పూజా, నూతన్ నాయుడు, దీప్తి సునయనలు ఉండ‌గా శ్యామ‌ల‌, గీతా మాధురిలు ప్రొటెక్టెడ్ జోన్‌లో ఉన్న‌ట్టు నాని తెలిపారు. నేటి ఎపిసోడ్‌లో రోల్ రైడా, పూజా, దీప్తి సునయనలలో ఒకరు బిగ్ బాస్ హౌస్‌ నుండి ఎలిమినేట్ కానున్నారు.

5248
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles