మ‌హాన‌టిలో మ‌రో పాత్ర రివీల్ చేసిన నాని

Sun,May 6, 2018 08:40 AM
nani reveals another role of mahanati

అల‌నాటి అందాల తార సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. మే 9న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ జోరందుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు చిత్రంలో ప్ర‌ధాన పాత్రలు పోషించిన కీర్తి సురేష్‌,స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ పాత్ర‌ల లుక్స్ మాత్ర‌మే రివీల్ చేసిన యూనిట్ ఇప్పుడు మిగతా పాత్ర‌లు పోషించిన వారి లుక్స్‌ని ఒక్కొక్క‌టిగా వీడియోల రూపంలో రివీల్ చేస్తున్నారు. ఎల్‌వీ ప్ర‌సాద్ పాత్ర‌లో అవ‌సరాల శ్రీనివాస్ గెట‌ప్‌కి సంబంధించిన‌ వీడియో విడుద‌ల చేసిన మేక‌ర్స్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కేవీరెడ్డి పాత్ర పోషించిన క్రిష్ పాత్ర‌కి సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. నాని వాయిస్‌తో మొద‌లైన ఈ వీడియోలో గొప్ప ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి గురించి చెబుతూ ఆ పాత్ర పోషించింది క్రిష్ అని తెలియ‌జేశాడు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌ రాజ్, షాలిని పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, తరుణ్ భాస్కర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా వారి పాత్ర‌ల‌ని కూడా అతి కొద్ది గంట‌ల‌లోనే రివీల్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్రియాంక ద‌త్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ చెబుతున్నాడు. మిక్కీ జే మేయ‌ర్ అందించిన సంగీతానికి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ బయోపిక్ గా రూపొందిన మహానటి చిత్రంలో సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను చూపించనున్నారు.


3882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles