బిగ్ బాస్‌2 హోస్ట్‌గా నేచుర‌ల్ స్టార్‌..!

Sat,March 17, 2018 01:27 PM
nani replaced with jr ntr

ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెర‌పై సంచ‌ల‌నం క్రియేట్ చేసిన తెలుగు రియాలిటి షో బిగ్ బాస్‌. ఈ కార్య‌క్ర‌మంతోనే ఎన్టీఆర్ బుల్లితెర‌కి డెబ్యూ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజ‌న్ 1లో జూనియ‌ర్ త‌న‌దైన సంబాష‌ణ‌ల‌తో పాటు కంటెస్టెంట్‌ల‌ని డీల్ చేసిన విధానం బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో న‌చ్చేసింది. బిగ్ బాస్ 2 సీజ‌న్ ఎప్పుడు మొద‌లు అవుతుందో అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా బిగ్ బాస్ 2 సీజ‌న్‌కి ఎన్టీఆర్ మ‌రోసారి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం లేదని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిప‌రమైన క‌మిట్ మెంట్స్ వ‌ల‌న ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉండ‌ర‌నేది తాజా స‌మాచారం. ఎన్టీఆర్ ప్లేస్‌లో నేచుర‌ల్ స్టార్‌ని ప‌రిశీలిస్తున్నారట పోగ్రాం నిర్వాహ‌కులు.

ఎన్టీఆర్ గైర్హాజ‌రు కార‌ణంగా ఆ స్థానంలో ప‌లువురు టాప్ హీరోల పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. అల్లు అర్జున్‌, రానా ల‌లో ఒక‌రు బిగ్ బాస్ 2 హోస్ట్ చేస్తార‌ని ప్ర‌చారం జరిగింది. క‌ట్ చేస్తే నేచుర‌ల్ స్టార్ నానిని సీజ‌న్ 2కి హోస్ట్‌గా ఫైన‌ల్ చేశార‌ని టాక్. గ‌తంలో నానికి రేడియో జాకీగా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉంది. అంతేకాదు మంచి స్పాంట‌నిటి కూడా అత‌నిలో ఉంది. ప్ర‌స్తుతం వెండితెర‌పై వ‌రుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. వీట‌న్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని బిగ్ బాస్2కి నానినిహోస్ట్‌గా తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్నారు. బిగ్ బాస్‌2 కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన కూడా ఈ ప్రోగ్రాం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంద‌ని చెబుతున్నారు.

3600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles