బ‌యోపిక్‌లో నాని.. త్వ‌ర‌లో రానున్న క్లారిటీ !

Fri,June 8, 2018 09:53 AM
nani plays main role in biopic

మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్‌లో బ‌యోపిక్ హ‌వా న‌డ‌వ‌గా, ఇప్పుడు అది టాలీవుడ్‌కి కూడా పాకింది. రీసెంట్‌గా లెజండ‌రీ న‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో మ‌హాన‌టి తెర‌కెక్కించారు. తెలుగులో తొలి బ‌యోపిక్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక త్వ‌ర‌లో ఎన్టీఆర్‌, వైఎస్సార్, ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి, కాంతారావు, కోడి రామ్మూర్తి నాయుడు, గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ల బ‌యోపిక్‌లు రానున్నాయి.

కోడి రామ్మూర్తి నాయుడు, గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ల బ‌యోపిక్‌లు రెండు రానానే చేయ‌నున్నాడ‌ని ఇటీవ‌ల టాక్స్ వినిపించాయి. కాని ప్ర‌స్తుతం ఆయ‌న పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండ‌టంతో పాటు రెండు బ‌యోపిక్‌లు ఒకేసారి చేస్తే అభిమానులు రిసీవ్ చేసుకోరేమోన‌ని ఆలోచించి టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్నాడ‌ట‌. దీంతో రానా స్థానంలో నేచుర‌ల్ స్టార్ నానిని ప‌రిశీలిస్తున్నారు.

గ‌జ‌దొంగ టైగర్ నాగేశ్వరరావు ఎన్నో బ్యాంకుల‌ని కొల‌గొట్టి చివరికి ఒక భారీ ఎంకౌంటర్లో చనిపోయాడు. ఆయ‌న పాత్ర‌లో న‌టించేందుకు నాని సుముఖంగానే ఉన్నాడ‌ని తెలుస్తుండగా , కిట్టువున్నాడు జాగ్రత్త'ను తెరకెక్కించిన వంశీకృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని టాక్ . త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. చివ‌రిగా కృష్ణార్జున యుద్ధం చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నాని త్వ‌ర‌లో బుల్లితెర‌పై బిగ్ బాస్ 2 షోతో సంద‌డి చేయ‌నున్నాడు.

3180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles