బుల్లితెర‌పైన నాని నేచుర‌ల్ స్టార్‌గా మార‌నున్నాడా..!

Sun,June 24, 2018 12:40 PM
nani performance increase day by day

నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ 2. ఎన్టీఆర్ హోస్ట్‌గా రూపొందిన బిగ్ బాస్ సీజ‌న్‌1కి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో జూన్ 10న సీజ‌న్ 2 స్టార్ట్ చేశారు. కార్య‌క్ర‌మం మొద‌లైన వారం త‌ర్వాత హోస్ట్‌గా నాని సెట్ కాలేదని, కంటెస్టెంట్స్‌తో మ‌జా రావ‌డం లేద‌ని ఇలా షోపై ప‌లు ర‌కాలు కామెంట్స్ చేస్తూ వ‌చ్చారు ప్రేక్ష‌కులు. కాని ఓ మూడు నాలుగు రోజుల నుండి అభిమానుల‌కి కావ‌ల‌సినంత స్ట‌ఫ్ బిగ్ బాస్ షోలో దొర‌కుతుంది. ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు చేసుకోవ‌డం, మాన‌సికంగానే కాదు శారీరికంగా కొంద‌రిని ఇబ్బంది పెట్ట‌డం, బెదిరింపులు, భావోద్వేగాల న‌డుమ నాని పీకిన చిన్న‌పాటి క్లాస్‌తో ఈ రియాలిటీ షో ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్‌ల‌లో సంజ‌న మొద‌టి వారం ఎలిమినేట్ కాగా, ఆ త‌ర్వాత నందిని అనే న‌టి హౌజ్ మేట్స్‌తో క‌లిసింది. ఇక‌ ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ నుండి కౌశల్, గణేష్, నూతన్ నాయుడులలో ఒక‌రు ఎలిమినేట్ కానుండ‌గా, వారు ఎవ‌ర‌నే విష‌యంలో కాస్త ఆస‌క్తి నెల‌కొంది .

బిగ్ బాస్ సీజ‌న్ 2 మొద‌ల‌వుతుంది అంటే ముందుగా హోస్ట్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న అభిమానుల‌లో మొద‌లైంది. ప‌లు కార‌ణాల వ‌ల‌న ఎన్టీఆర్ సీజ‌న్ 2 హోస్ట్ చేయ‌డని తెలుసుకున్న ప్రేక్ష‌కులు ఆయ‌న స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తార‌ని ప‌లు రకాలుగా ఆలోచించ‌డం మొద‌లు పెట్టారు. ఈక్ర‌మంలో నాని హోస్ట్ చేస్తాడ‌ని నిర్వాహ‌కులు చెప్ప‌డంతో ప్రేక్ష‌కులు కాస్త కూల్ అయ్యాడు. రేడీయో జాకీగా అనుభవం ఉన్న నాని వెండితెర‌పై కూడా అద‌ర‌గొడుతున్నాడు కాబ‌ట్టి, ఈ రియాలిటీ షోని రక్తిక‌ట్టిస్తాడని అనుకున్నారు. కాని లాంచింగ్ రోజు నాని తేలిపోయాడు.ఎన్టీఆర్ రేంజ్‌లో నాని అల‌రించ‌లేద‌ని అన్నారు. షోలో పాల్గొన్న స‌భ్యురాలు సంజ‌న‌ కూడా ఎన్టీఆర్‌లా నాని చేయ‌లేక‌పోతున్నాడ‌ని హౌజ్ నుండి బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూల‌లో చెప్పుకొచ్చింది. తారక్ ని ఐ ఫోన్ తో పోలిక పెడుతూ, నానిని తక్కువ విలువ ఉన్న ఫోన్ తో కంపేర్ చేసింది. ఒక్కసారి ఖరీదైన ఐఫోన్ ని వాడాక వేరేవి ఎలా నచ్చవో ఇది అంతే అని చెప్పింది సంజనా. ఈ విమ‌ర్శ‌లని పాజిటివ్‌గా తీసుకున్న నాని హుందాగా బ‌దులిచ్చాడు. నాకు కూడా ఐఫోన్ ఇష్టం అని అన్నాడు. క‌ట్ చేస్తే సీజ‌న్ 2లో నిన్న‌టి ఎపిసోడ్‌తో క‌లిపి నాని క‌నిపించింది కేవ‌లం నాలుగు సార్లు మాత్ర‌మే. మూడు ఎపిసోడ్స్‌లో తేలిపోయిన నాని నాలుగో ఎపిసోడ్‌లో మాత్రం వ‌న్‌మ్యాన్ షో చేశాడు అని అంటున్నారు నెటిజ‌న్స్ .

ఈ రోజు రాత్రి 9గం.ల‌కి బిగ్ బాస్ సీజ‌న్ 2లో 15వ ఎపిసోడ్ ప్ర‌సారం కానుండ‌గా, సీజ‌న్‌లో రెండో ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ నేడు జ‌ర‌గ‌నుంది. దీంతో నేటి ఎపిసోడ్‌పై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అదీ కాక నిన్న ఇంటి స‌భ్యుల‌కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన నాని ఈ రోజు వారితో ఎలాంటి సంద‌డి చేస్తాడా అని అభిమానులు ఆలోచించ‌సాగారు. ఈ నేప‌థ్యంలో కొద్ది సేప‌టి క్రితం నేటి ఎపిసోడ్ ప్రోమో వ‌దిలారు. ఇందులో నాని సంద‌డి ఓ రేంజ్‌లో ఉంద‌నే చెప్పాలి. యాంక‌రింగ్‌లో మెచ్యూరిటీ ప్ర‌ద‌ర్శిస్తూ ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి ప‌లు టాస్క్‌లు చేయిస్తున్న తీరు చూస్తుంటే ఈ రోజు నాని బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత వినోదాల విందు అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. వెండితెర‌పై నేచుర‌ల్ స్టార్‌గా చ‌క్కని ముద్ర వేయించుకున్న నాని రాను రాను త‌న టాలెంట్‌కి ప‌దును పెడుతూ చ‌క్క‌ని ప‌రిణితితో ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించ‌డం ఖాయం అంటున్నారు . మ‌రి ప్రోమోతోనే ఇంత‌ గిలిగింత‌లు పెట్టిన నాని షోలో ఇంకెంత న‌వ్విస్తాడో చూడాలి.

2991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS