హీటెక్కించి ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూడ్‌లోకి తీసుకెళ్లిన నాని

Sun,September 23, 2018 08:15 AM
Nani Offers Wise Advice to house mates

బిగ్ బాస్ సీజ‌న్ 2కి వారం రోజుల‌లో శుభం కార్డ్ ప‌డ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ వారం బిగ్ బాస్ హౌజ్ హీటెక్క‌గా చివ‌రి వారం స‌ర‌దాగా సాగాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు. శ‌నివారం ఎపిసోడ్‌లో నాని కూడా ఇదే విష‌యాన్ని హౌజ్‌మేట్స్‌తో చెప్పారు. శ‌నివారం నాడు జరిగిన 105వ ఎపిసోడ్ హైలైట్స్ విష‌యానికి వ‌స్తే సీజ‌న్ మొద‌టి నుండి స్ట్రాంగ్‌గా ఉన్న నువ్వు ఎందుకంత ఎమోష‌న్ అయ్యావు అని నాని..రోల్‌ని ప్ర‌శ్నించాడు. అందుకు అమిత్ బ‌య‌ట‌కి వెళ్ళిపోవ‌డం, చెల్లిని మిస్ అయిన ఫీలింగ్ రావ‌డం చాలా ఎమోష‌న‌ల్ అయ్యేలా చేసింద‌ని రోల్‌ అన్నాడు.

ఇక తనీష్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన నాని.. ఇప్పుడు నిన్ను, కౌశ‌ల్‌ని బ‌య‌ట‌కు పంపిస్తాం. ట‌చ్ చేయి చూద్ధాం అని అన్నాడు. అస‌లు నీ మాట‌ల‌తో నువ్వు సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామ‌ని అనుకుంటున్నావు. నీ టెంప‌ర్ త‌గ్గించుకోమ‌ని మొద‌టి నుండే చెబుతున్నాను. అయిన నీ ప్రవ‌ర్త‌న మార‌లేదు అని త‌నీష్‌కి చుర‌క‌లు అంటించారు నాని . ఇక ఫినాలేకి మొద‌టగా వెళ్ళినందుకు సామ్రాట్‌ని అభినందించారు నాని. త‌ను కౌశ‌ల్‌పై అంత బ‌ర‌స్ట్ అవ‌డానికి కార‌ణం కూడా చెప్పాడు సామ్రాట్‌. కుక్క‌ల‌తో పోల్చే స‌రికి త‌ట్టుకోక‌లేక‌పోయాను. అందుకే అలా అంత ఫైర్ కావొచ్చింద‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు. ఇక మీ గుడ్డు జాగ్ర‌త్త టాస్క్‌లో త‌న‌కి అంత స‌పోర్టివ్‌గా ఉన్న గీతా, దీప్తి, త‌నీష్ కి స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పాడు సామ్రాట్‌.

గీతా మాధురి విష‌యానికి వ‌స్తే ..నువ్వు అస‌లు విష‌యాన్ని మాట్లాడ‌కుండా పాత సంగ‌తులు గుర్తు చేసి, వాటి మ‌ధ్య వేరే వాళ్ళ‌ని ఇన్వాల్స్ చేయ‌డం, దీంతో గొడ‌వ పెద్ద‌ది కావ‌డం జ‌రుగుతుంది. చెప్పాలనుకున్నప్పుడు మీరు మాత్రమే కాకుండా అందరూ ఒకే సారి నోరేసుకుని పడిపోవడం వల్ల అక్కడ ఏమౌతోందో షో చూసే వాళ్లకు అర్ధం కావడం లేదన్నారు నాని. ఇక త‌న గ్రాఫ్‌ని మెల్ల‌మెల్ల‌గా పెంచుకుంటూ వ‌స్తున్న దీప్తికి కంగ్రాట్స్ చెప్పాడు నాని. ఇక ల‌ల్లీ బ‌ర్త్‌డే రోజు కేక్ తో పాటు గ్రీటింగ్ కార్డ్‌ని పంపిచ‌డంతో నువ్వు చాలా హ్యీపీగా ఫీలై ఉంటావు క‌దా అని కౌశ‌ల్‌ని అడిగాడు నాని. ఇందుకు చాలా సంతోషించిన‌ట్టు తెలిపాడు కౌశ‌ల్.

ఇక గ‌త‌వారం వివాదానికి కేంద్ర‌బిందువైన కౌశ‌ల్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన నాని .. నీ నోటి నుండి అలాంటి ప‌దం( ‘కుక్కల్లా తనపై పడిపోతున్నారన్న’ కామెంట్‌) వ‌స్తుంద‌ని అనుకోలేదు. అంద‌రికి ఎంతో మ‌ర్యాదిచ్చే నువ్వు అలా అనే స‌రికి నేను షాక్ అయ్యాను. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నంలో భాగంగా కౌశ‌ల్‌.. నేను టేబుల్ దగ్గర తినేటప్పుడు వీళ్లందరూ.. జీపీడీ అంటారు దాని మీనింగ్ ఏంటో అర్ధం కాదు. అలానే తాను కూడా కొన్ని షార్ట్ కట్స్‌లో అనుకుంటా అలా వచ్చిందే ఈ షార్ట్ కట్. తన దృష్టిలో కుక్క అంటే.. ‘కూర్చుని ఉండకుండా కేవ్ కేవ్ అరిచేవాడు’ అంటూ కొత్త అర్ధం ఇచ్చారు కౌశల్. దీనిపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన నాని ..మరి అప్పుడే దానికి అర్ధం చెప్పొచ్చుగా. నువ్వు ఫ్ర‌స్ట్రేష‌న్‌లో అన్న మాట అది . ఆవేశంలో టంగ్ స్లిప్ అయి అలా వ‌చ్చింది.. అదే నువ్ చెప్తే మ్యాటర్ క్లోజ్ అన్నారు నాని.

ఏదేమైన ఈ వారం మీరు చేసిన ర‌చ్చ‌కి హౌజ్‌కి చాలా చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని హౌజ్‌మేట్స్‌ని మంద‌లించారు నాని. ఇక చివ‌రి వారం అయిన అంద‌రు హ్యాపీగా స‌రదాగా క‌లిసి ఉంటారని ఆశిస్తున్నానంటూ నాని తెలిపారు. ఇక ఎప్ప‌టిలాగానే కాల‌ర్ క‌ల‌ప‌మ‌ని బిగ్‌బాస్‌కి ఆదేశ‌మిచ్చారు నాని. దీంతో కాల‌ర్ దీప్తితో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. త‌ప్ప‌క విజ‌యం సాధిస్తావు అని దీప్తికి ధైర్య‌మిచ్చాడు ఆ కాల‌ర్‌. ఇక హౌజ్‌లో బెస్ట్ మూమెంట్స్‌, వ‌ర‌స్ట్ మూమెంట్స్ ఏంట‌ని ఒక్కొక్క‌రిని అడిగి తెలుసుకున్న నాని, చివ‌రికి ఆదివారం రోజు ఒక‌రిని ఎలిమినేట్ చేయ‌డంతో పాటు రేస్ టూ ఫినాలేలోకి ఎవ‌రు అడుగుపెట్ట‌నున్నారో అనే విష‌యాన్ని కూడా చెబుతాను అని 105వ ఎపిసోడ్‌కి ప్యాక‌ప్ చెప్పాడు.

5560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles