మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నాని

Sun,November 18, 2018 07:31 AM
nani next with mohan krishna indraganti as a multi starrer

ఒక వైపు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తూ మ‌రో వైపు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నాడు నాని. ఇటీవ‌ల దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇందులో డాక్ట‌ర్‌గా ఆక‌ట్టుకున్నాడు నాని. ప్ర‌స్తుతం క్రికెట్ నేప‌థ్యంలో జెర్సీ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్ష‌కులకి అమిత‌మైన ఆనందాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు. అయితే జెర్సీ సెట్స్ పై ఉండగానే మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చేసేందుకు నాని సిద్ధ‌మ‌య్యాడ‌ట‌. నానితో అష్టా చెమ్మా, జెంటిల్‌మెన్ చిత్రాలు తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ఓ మల్టీ స్టార‌ర్ క‌థ‌ని సిద్ధం చేసాడ‌ట‌. ఇటీవ‌ల నానిని క‌లిసి ఆ క‌థ‌ని వినిపించ‌గా, ఆ క‌థ నానికి తెగ న‌చ్చేయడంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసాడ‌ట‌. మరో హీరోగా ఎవరిని ఎంపిక చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌కుడు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. చివ‌రిగా స‌మ్మోహ‌నం చిత్రంతో మంచి హిట్ కొట్టిన ఇంద్ర‌గంటి మ‌ల్టీ స్టార‌ర్‌ని అద్భుతంగా తెర‌కెక్కిస్తాడ‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ మ‌ల్టీ స్టార‌ర్ రూపొందనుంద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో.

1950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles