'సభకు నమస్కారం' అంటున్న నాని ..!

Thu,June 21, 2018 10:05 AM

నేచుర‌ల్ స్టార్ నాని జోరు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఓ వైపు బుల్లితెర కార్య‌క్ర‌మం బిగ్ బాస్ 2 షో చేస్తూనే మ‌రో వైపు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా త‌ర్వాత ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో జెర్సీ అనే చిత్రం చేయ‌నున్నాడు. మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. చిత్రంలో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. ఇక ఈ సినిమాతో పాటే కొత్త ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా చేయాల‌ని నాని భావించాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దిల్ రాజు నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ సినిమాకి స‌భ‌కు న‌మ‌స్కారం అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. చిత్ర క‌థ కాస్త వైవిధ్యంగా ఉండ‌డంతో నాని సినిమా ఓకే చేశాడని అంటున్నారు. ఈ చిత్రం పొలిటిక‌ల్ నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ని స‌మాచారం. గతంలో నానితో దిల్ రాజు నిర్మించిన 'నేను లోకల్' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

2873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles