ఈ సారి నిఖిల్‌తో నాని మ‌ల్టీ స్టార‌ర్

Wed,November 21, 2018 08:27 AM
nani next multi starrer with nikhil

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది. అందుకే మ‌న ద‌ర్శ‌కులు కూడా అదే నేప‌థ్యంకి సంబంధించి వినూత్న క‌థ‌లని సిద్ధం చేస్తున్నారు. ఇటీవ‌ల స‌మ్మోహనం'తో హిట్ కొట్టేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ, తన తదుపరి సినిమాని మ‌ల్టీ స్టార‌ర్‌గా చేయ‌నున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో ఓ హీరో నాని కాగా, మ‌రో హీరో కోసం అన్వేషిస్తున్నాడ‌ని అన్నారు. తాజా స‌మాచారం ప్రకారం ఇంద్ర‌గంటి మ‌ల్టీ స్టార‌ర్‌లో మ‌రో హీరోగా యువ‌హీరో నిఖిల్‌ని ఎంపిక చేసుకున్నాడ‌ట‌. ఇటీవ‌ల నిఖిల్‌కి కూడా క‌థ వివరించ‌గా, ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తుంది. అయితే ప్ర‌స్తుతం ముద్ర సినిమాతో బిజీగా ఉన్న నిఖిల్ త్వ‌ర‌లో శ్వాస అనే సినిమా చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన వెంట‌నే ఇంద్ర‌గంటి సినిమా టీంతో క‌ల‌వ‌నున్నాడు. మ‌రో వైపు నాని క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న జెర్సీ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాని, నిఖిల్ కాంబినేష‌న్‌లో రానున్న మ‌ల్టీ స్టార‌ర్ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త వినోదాన్ని అందిస్తుంద‌ని అంటున్నారు.

1341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles