నాని మూవీకి డెబ్యూ డైరెక్టర్

Fri,September 30, 2016 11:40 AM
nani next movie with debut director

నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. భలే భలే మగాడివోయ్ ఇచ్చిన జోష్ రీసెంట్‌గా విడుదలైన మజ్ను చిత్రం వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నేను లోకల్ అనే చిత్రాన్ని చేస్తున్న ఈ యంగ్ హీరో తన తర్వాతి చిత్రానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నాని తర్వాతి చిత్రం ప్రముఖ రచయిత కోనవెంకట్‌తో కలిసి చేయనుండగా, ఈ చిత్రానికి దర్శకుడు శివ అని తెలుస్తోంది. ఈ చిత్రంతో శివ డెబ్యూ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇక సరైనోడు చిత్రంలో విలన్‌గా మెప్పించిన ఆది పినిశెట్టి నాని చిత్రంలో ఓ క్రూషియల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. డిసెంబర్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుండగా, కొన్ని షెడ్యూల్స్‌ని అబ్రాడ్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. డివివి దానయ్య, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

1729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles