నాని తర్వాతి మూవీకి ముహూర్తం ఫిక్స్ !

Sun,March 20, 2016 04:07 PM
nani next movie on april

ఎట్ ప్రెజెంట్ టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో నాని లీడింగ్ లో ఉన్నాడు. నాని ఇప్పుడు అటు నిర్మాతలకు, ఇటు ఆడియన్స్ కూ క్రేజీ హీరోగా మారాడు. నాని సినిమా అంటే చాలు సరదాగా, హాయిగా చూసేయవచ్చనే టాక్, ఇమేజ్ వచ్చేశాయి. వరస హిట్లతో దూసుకుపోతున్న నానికి ఇప్పుడు చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే ఓ సినిమా ఏప్రిల్ లో స్టార్ట్ కాబోతోంది.

ఇప్పటిదాకా వచ్చిన నాని సినిమాలు చిన్నవే అయినా పెద్ద హిట్ సాధించాయి.భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమగాథ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. వరస హిట్లతో నాని క్రేజీ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్ ని అందుకోబోతున్నాడు. ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నాడు నాని. విశేషమేమంటే ఈమధ్య కాలంలో ఏ పెద్ద హీరో లేనంత బిజీగా మారిపోయాడు.

ప్రస్తుతం నానికి లక్ లక్కలా పట్టుకుంది. ఒక సినిమా రిలీజై ఆడుతుంటే ఇంకో సినిమా షూటింగ్ లో ఉంటోంది. షూటింగ్ లో ఉన్న మూవీ పూర్తి కాకముందే మరో సినిమా ప్లానింగ్ లో ఉంటోంది. తనను పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో ఓ మూవీ చేస్తోన్న నాని, ఆ సినిమా షూటింగ్ లో ఉండగానే మరో పిక్చర్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారు.

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా హిట్టయిన విరించి వర్మ, నాని నెక్స్ట్ పిక్చర్ ని డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుసు. ఈ ప్రాజెక్టును ఏప్రిల్ నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్ళేలా నాని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన కృష్ణతో చేస్తోన్న సినిమాను ఏప్రిల్ కల్లా పూర్తి చేసి, ఏప్రిల్ నుంచి విరించి వర్మ మూవీకి పనిచేయాలని నాని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

1564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles