నాని ప్రమోషన్ స్టైల్ చూశారా !

Fri,June 10, 2016 07:45 AM
nani new promotion style

ఈ రోజుల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలు కూడా ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ తారగణం ఉన్నా అవి సినిమాకు ప్లస్ కావడం లేదు. ఈ నేపధ్యంలో దర్శక నిర్మాతలు వినూత్న రీతిలో తమ సినిమాలను జనాల్లోకి చేరవేస్తున్నారు. దీంతో ఓ మోస్తరుగానైన కాసుల పంట పండుతుందని వారి అభిప్రాయం. మొన్నటికి మొన్న హీరో హీరోయిన్లతో లిప్ లాక్‌ని ప్రాక్టీస్ చేయిస్తున్న దర్శకుడు ఆ సన్నివేశాలను చిత్రీకరించి మేకింగ్ వీడియో అంటూ బయటకు రిలీజ్ చేశాడు. ఇక తాజాగా నాని తన సినిమాకు సరికొత్త రీతిలో ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కలసి తాజాగా జెంటిల్‌మన్ చిత్రాన్ని చేసిన నాని 2008లో ఇదే డైరెక్టర్‌తో అష్టా చెమ్మా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం నాని కెరియర్‌కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. అయితే ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్ .. అష్టా చెమ్మా టూ జెంటిల్ మన్’ అని ఓ కామెంట్ పెట్టి తన ఫేస్ బుక్ పేజ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు నాని. ఇందులో నాని, అవసరాల శ్రీనివాస్ మధ్య జరిగే సరదా సన్నివేశాలను చూపించారు. జెంటిల్ మన్ చిత్రం జూన్ 17న విడుదల కానుండగా ఇందులో నాని డ్యూయల్ షేడ్స్‌లో కనిపించి సందడి చేయనున్నాడు.

2657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles