నాని ఫోటో లీక్ చేసిన నాగార్జున‌

Thu,April 5, 2018 08:46 AM
nani nagarjuna tweets goes viral

టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ ఊపందుకున్న‌సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం నాని, నాగ్ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతుంది. శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిన్న‌టి నుండి రామోజీ ఫిలింసిటీలో రెండో షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో నాని,నాగ్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా నాని, నాగ్‌లు ఒక‌రి ఫోటోలు మ‌రొక‌రు లీక్ చేసి మురిసిపోయారు. షూటింగ్‌కి వెళ్ళే ముందు నాని త‌న ట్విట్ట‌ర్‌లో ఈ రోజు నేను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌కి వెళ్ళ‌డానికి చిన్న పిల్లాడిలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకో చెప్పుకోండి. ఈ రోజు నుండి కింగ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వెల్‌క‌మ్ ఆన్ బోర్డ్ అని ట్వీట్ చేశారు. దీనికి నాగ్ కూడా నాని ఫోటోని షేర్ చేస్తూ .. దొరికావ్ నాని. నీలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తితో పనిచేయడం కోసం వేచి చూడలేను’’ అని ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్స్ చూసి అభిమానులు భలే సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందాన, సంపూర్ణేష్ బాబు తదితరులు నటిస్తున్నారు. మెట్రో ట్రైన్‌లో షూటింగ్ జ‌రుపుకున్న తొలి చిత్రం ఇదే కాగా, ఈ మూవీ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తే, నాని డాక్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.3177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles