నాని హీరోగా మ‌హేష్ సోద‌రి సినిమా ..!

Thu,December 14, 2017 09:41 AM
nani movie with manjula

సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌సురాలిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంజుల న‌టిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలిగా ప‌లు విభాగాల‌లో రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ ,అమైరా ద‌స్తూర్‌, త్రిదా చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మ‌న‌సుకు న‌చ్చింది అనే టైటిల్‌తో ఓ సినిమాని తెర‌కెక్కిస్తుంది మ‌హేష్ సోదరి మంజుల‌. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్ఎల్ పి బ్యానర్ లో కిరణ్, సంజయ్ స్వరూప్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఇది ప్ర‌తి ఒక్కరి మ‌న‌సుకి క‌నెక్ట్ అయింది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే త‌న నిర్మాణంలో నాని హీరోగా ఓ సినిమా చేయాల‌ని మంజుల భావిస్తుంది. అఖిల్‌తో హ‌లో చిత్రాన్ని తీసిన విక్ర‌మ్ కె కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక నాని న‌టించిన ఎంసీఏ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుండ‌గా, మ‌రో చిత్రం కృష్ణార్జున యుద్దం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

1764
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS