నాని చిత్రానికి ఆస‌క్తిక‌ర టైటిల్

Fri,June 15, 2018 11:36 AM
nani movie title revealed

వ‌రుస స‌క్సెస్‌ల‌తో జెట్ స్పీడ్‌లా దూసుకుపోయిన నానికి కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో నానికి ట్రిపుల్ హ్యాట్రిక్ మిస్ అయింది. అయితే ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున‌తో క‌లిసి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు నాని. ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. దీంతో పాటు బిగ్ బాస్ 2 రియాలిటీ షో కార్య‌క్ర‌మంలోను పాల్గొంటున్నాడు. అయితే ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో నాని త‌న తదుప‌రి చిత్రం చేయ‌నున్నట్టు నిన్న ప్ర‌క‌టించాడు. మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. కొద్ది సేప‌టి క్రితం చిత్ర టైటిల్‌ని రివీల్ చేశారు మేక‌ర్స్‌. జెర్సీ అనే టైటిల్‌ని నాని మూవీ టైటిల్‌గా ఫిక్స్ చేసినట్టు తెలిపారు. దీనికి క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయోద్దు అని ట్యాగ్ లైన్ పెట్టారు. పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రంలో నాని క్రికెట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని అర్ధ‌మ‌వుతుంది.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ప్ర‌స్తుతం చైతూ మూవీ రూపొందుతుంది. ఈ చిత్రాన్ని మారుతి తెర‌కెక్కిస్తున్నాడు. శ‌ర్వానంద్‌- సుధీర్ వర్మ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రాన్ని కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది. మొత్తానికి మూడు ఢిఫ‌రెంట్ సినిమాల‌ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రేక్ష‌కుల‌కి ఎలాంటి వినోదం అందిస్తుందో చూడాలి.


2544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles