జెర్సీ ధ‌రించేందుకు సిద్ధ‌మైన నాని

Sat,August 11, 2018 10:38 AM
nani join the set of jersey in september

వ‌రుస స‌క్సెస్‌ల‌తో జెట్ స్పీడ్‌లా దూసుకుపోయిన నానికి కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసిన సంగ‌తి తెలిసిందే. డ్యూయ‌ల్ రోల్‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచిన కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో నానికి ట్రిపుల్ హ్యాట్రిక్ మిస్ అయింది. అయితే ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున‌తో క‌లిసి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు నాని. దేవదాస్ అనే టైటిల్‌తో రూపొందుత‌న్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. దీంతో పాటు బిగ్ బాస్ 2 రియాలిటీ షో కార్య‌క్ర‌మంలోను పాల్గొంటున్నాడు నాని. మ‌రో వైపు ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో నాని జెర్సీ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు . మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది . క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయోద్దు అని జెర్సీకి ట్యాగ్ లైన్‌గా ఉంచారు.

జెర్సీ చిత్రంలో నాని మూడు విభిన్న రూపాల‌లో క‌నిపించి త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తాడ‌ని అంటున్నారు.కాలేజ్ విద్యార్ధి కం యంగ్ హీరో పాత్ర‌తో పాటు పెళ్ల‌యిన న‌డివ‌య‌స్కుడు, ముస‌లి వ్య‌క్తిగా మూడు ద‌శ‌ల‌లో మూడు విభిన్న రూపాల‌లో నాని మురిపిస్తాడ‌ని స‌మాచారం. నాని మూడు పాత్ర‌ల‌ని ఛాలెంజ్‌గా తీసుకొని న‌టిస్తున్నాడ‌ని చెబుతున్నారు. న‌ట‌నకి ఆస్కారం ఉన్న ఈ మూడు పాత్ర‌ల‌తో నాని చేయ‌బోయే మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. అయితే ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ రెండవ వారం నుండి జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ లోపు దేవ‌దాస్‌, బిగ్ బాస్ 2 పూర్తి చేసి జెర్సీ షూటింగ్‌లో నాని పాల్గొన‌నున్నాడ‌ని అంటున్నారు.

3406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles