నాని జెర్సీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టైం ఫిక్స్

Tue,April 9, 2019 11:53 AM

వ‌రుస సినిమాలతో ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగించే నాని ప్ర‌స్తుతం జెర్సీ, గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. జెర్సీ చిత్రం మ‌ళ్ళీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 12న ఉదయం 9గంటలకు విడుదల చేయనుండగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 15న నిర్వహించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు.


జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషిస్తున్నారు. 36ఏళ్ల వయసులో అర్జున్ క్రికెట్‌లో తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన పరిస్థితులేమిటన్నది ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. సత్యరాజ్, రోనిత్‌కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా సను వర్గీస్ ప‌నిచేస్తున్నారు. అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. హిందీ లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

1536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles