చూడటానికి పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని వరుస చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. ఆయన ప్రస్తుతం జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. జెర్సీ చిత్రం మళ్ళీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. నాని అర్జున్ పాత్రలో అదరగొట్టాడు. కొన్ని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 15న నిర్వహించి సినిమాపై మరింత హైప్ తేవాలని యూనిట్ భావిస్తుంది. జెర్సీ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. అనిరుధ్ రవిచందర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. సత్యరాజ్, రోనిత్కర్మ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హిందీలోను విడుదల కానుంది.
