చిన్నారి లేఖతో ఇంప్రెస్ అయిన నాని

Fri,September 23, 2016 10:39 AM
nani impressed by a little girl letter

నేచురల్ స్టార్ నానికి చిన్న పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్ర షూటింగ్ సమయంలో ఓ చిన్నారితో కలిసి సెట్‌లో చాలా సరదాగా గడిపాడు నాని. అంతే కాదు ఈ హీరో బర్త్‌డే రోజు ఆ చిన్నారి ఓ స్పెషల్ వీడియోని పంపగా ఆ వీడియోకి ఫుల్ ఇంప్రెస్ అయ్యాడు నాని. ఇక తాజాగా నానికి ఓ చిన్నారి లేఖ రాసింది. అది చూసి సంతోషపడిన నాని ఆ లెటర్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఆ చిన్నారి తాను రాసిన లెటర్‌ని షూటింగ్ స్పాట్‌లో ఇవ్వగా, ఈ లెటర్ తనకు ఓ అవార్డుతో సత్కరించిన అనుభూతిని కలిగించిందని కామెంట్ పెట్టాడు. ఆ లెటర్‌లో నాని అన్నా మై ఫేవరేట్ హీరో అని రాసి ఉంది. దాంతో పాటు హీ ఈజ్ వెరీ కైండ్.. హీ ఈజ్ ఫన్నీ .. హీ ఈజ్ లవింగ్.. హీ ఈజ్ కేరింగ్.. హీ ఈజ్ ద బెస్ట్ హీరో.. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్.. ఐలవ్ హిజ్ యాక్టింగ్.. అంటూ నానిపై తనకున్న ప్రేమని లెటర్ ద్వారా తెలిపింది ఆ చిన్నారి.

1643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles