దేవ‌దాస్ నుండి డిలీటెడ్ సీన్ - వీడియో

Sun,September 30, 2018 12:20 PM
Nani Hospital Deleted Scene

కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ దేవ‌దాస్‌. శ్రీరామ‌వ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌లైంది. ఈ మూవీకి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు అభిమానుల ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. డాన్‌గా నాగ్‌, డాక్ట‌ర్‌గా నాని త‌మ త‌మ పాత్ర‌ల‌ని ర‌క్తి క‌ట్టించారు. నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది ఈ చిత్రం. అయితే చిత్రంలో నానికి సంబంధించిన కొన్ని నిమిషాల సీన్‌ని డిలీట్ చేశారు. ఆ వీడియోని సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో డాక్ట‌ర్ దాస్, డాక్ట‌ర్ భ‌ర‌ద్వాజ్‌ల మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశం అభిమానులు ఆక‌ట్టుకునేలా ఉంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు కీల‌క పాత్ర‌ల‌లో నటించారు.

3384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles