జ‌న‌వ‌రి 1న అర్జున్‌ని క‌లవ‌బోతున్నాం

Sun,December 30, 2018 07:29 AM

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో చేస్తున్న చిత్రం జెర్సీ . మ‌ళ్ళీ రావాఫేం గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది . క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయోద్దు అని జెర్సీకి ట్యాగ్ లైన్‌గా ఉంచారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈచిత్రం లో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని కొద్ది రోజులుగా రోజుకు 3గంటలు క్రికెట్లో శిక్షణ తీసుకున్నాడ‌ట . క్రికెట‌ర్‌గానే కాదు పెళ్ల‌యిన న‌డివ‌య‌స్కుడు, ముస‌లి వ్య‌క్తిగా కూడా నాని ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి జనవరి 1న ఏదో అప్‌డేట్ ఇవ్వనున్న విషయాన్ని సూచిస్తూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తారా, లేదంటే టీజ‌ర్ రిలీజ్ చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles