ల‌ఫ్ఫాంగిరిగిట్ట సినిమాకి నాని రేటింగ్ ఎంతో తెలుసా ?

Sun,July 22, 2018 07:12 AM
nani gives super rating for hosemates movie

శ‌నివారం వ‌చ్చిందంటే బిగ్ బాస్‌లో నాని సంద‌డి స్టార్ట్ అయిన‌ట్టేన‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఈ శ‌నివారం కూడా గ్రాండ్ ఇచ్చిన నాని ఎప్ప‌టిలానే ఓ పిట్ట క‌థ చెప్పాడు. సంక్రాంతి సినిమాని పిట్ట‌క‌థ‌లా చెప్పుకొచ్చిన నాని ఈ వారం ఇంటి స‌భ్యులు సినిమా తీసి అలానే క‌లిసిపోయార‌ని అన్నాడు. ఇక ఆ త‌ర్వాత శుక్ర‌వారం ఇంట్లో జ‌రిగిన ర‌చ్చ గురించి స్క్రీన్‌లో చూపించారు నాని. రోల్ రైడా సాంగ్‌ని బిగ్ బాస్ హౌజ్‌లో ప్లే చేయ‌గా, బాత్ రూంలో ఉన్న రోల్ త‌న సాంగ్ అంటూ బ‌య‌ట‌కు ఉరికొచ్చి చిందులేశాడు. దొంగ‌త‌నాలతో పాటు ఎలిమినేష‌న్ స్ట్రాట‌జీల‌పై డిస్క‌ష‌న్స్‌ని కూడా చూపించారు. ఆ త‌ర్వాత వారంలో జ‌రిగిన ఇంటి స‌భ్యుల పనిత‌నం గురించి వారితో స‌ర‌దాగా సంభాషించారు నాని.

శనివారం ఎపిసోడ్‌లో ఎప్పుడు చీవాట్లు పెట్టే నాని ఈ సారి మాత్రం హౌజ్‌మేట్స్‌తో స‌ర‌దాగా మాట్లాడారు. వారం మొత్తంలో జ‌రిగిన విష‌యాల‌పై ఒక్కొక్క‌రితో మాట్లాడుతూ ఫ‌న్ జ‌న‌రేట్ చేశారు. త‌నీష్ కెప్టెన్ టాస్క్‌లో భాగంగా టమాటోల‌తో జ్యూస్ తీయ‌డంపై నానికి చాలా వివ‌ర‌ణ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో నాని తెగ న‌వ్వేశారు. ఆ త‌ర్వాత మిగ‌తా ఇంటి స‌భ్యుల మంచి చెడుల గురించి కాసేపు చర్చించారు. దీప్తి సున‌య‌న‌కి మ‌రోసారి చుర‌క‌లంటిస్తూ, త‌నీష్ ఇంటి నుండి వెళ్లిపోతే నీ ప‌రిస్థితి ఏంటి? మళ్లీ ఎవరితో ఉంటావ్ అంటూ డైరెక్ట్‌గా అడగటంతో అప్పుడు నేను ఇండిపెండెంట్‌గా ఉండిపోతా అంటూ బదులిచ్చింది సునైనా. కౌశల్, నందినిల మధ్య ఉన్నగొడవ గురించి రాబట్టే ప్రయత్నం చేశారు. అమిత్ కోడి గుడ్డు కొట్టిన‌ప్పుడు గ‌ణేష్ గేట్లు తీయండి నేనెళ్లిపోతా అని అర‌వ‌డంపై నాని కాస్త సీరియ‌స్ అయ్యారు. ఇప్పుడు గేట్లు ఓపెన్ చేయిస్తా, వెళ‌తా అంటూ వెళ్లిపో అని అన్నారు. కాని అందుకు గ‌ణేష్ సుముఖ‌త చూప‌లేదు.

అయితే శుక్ర‌వారం రాత్రి లైట్స్ ఆఫ్ అయిన త‌ర్వాత ఇంటి స‌భ్యులు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎందుకు వ‌చ్చాం? ఏ కారణంగా ఇక్క‌డ ఉంటున్నాం? ఎలిమినేట్ అయితే ప‌రిస్థితి ఏంట‌నే విష‌యాల‌ని ఒక్కొక్క‌రిగా వివ‌రించారు. తేజూ తాను మనీ కోస‌మే వ‌చ్చిన‌ట్టు డైరెక్ట్‌గా చెప్పింది. ఎన్ని సినిమాలు చేసిన ఇంత సంపాదించ‌లేన‌ని అంది. సామ్రాట్ మాట్లాడుతూ.. బ‌య‌ట లైఫ్‌లో నాపై చాలా రూమ‌ర్స్ ఉన్నాయి. నా తండ్రి ఆరోగ్యం బాగోలేదు. అయిన‌ప్ప‌టికి మా నాన్న ఇచ్చిన ధైర్యంతో ఇంట్లోకి రాగ‌లిగాను అని అన్నాడు. ఇక యాంక‌ర్ దీప్తి త‌ను ఎలిమినేట్ అయిన సంతోషంగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాను అని పేర్కొంది. ఈ జ‌న‌రేష‌న్‌లో ర్యాప్ సింగింగ్ గురించి జ‌నాల‌లో అవ‌గాహ‌న లేదు. అందుకు అంద‌రికి తెలిసేలా ఎంతో మంది ర్యాపర్‌ని త‌యారు చేయాల‌నే కోరిక‌తోనే ఇక్క‌డకి వ‌చ్చాన‌ని చెప్పాడు రోల్ రైడా. ఇక తనీష్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఇంట్లో అంద‌రు సొంత వాళ్ళలా అయ్యార‌ని, ఎవ‌రు వెళ్ళిన బాధ అనిపిస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. త‌న‌కి కూతురు పుడితే నందినిలా క్యూట్‌గా ఉండాల‌ని కోరుకుంటాన‌ని చెప్ప‌డంతో ఆమె తెగ సిగ్గుప‌డిపోయింది.

ఇక ఇంటి స‌భ్యులు అంద‌రు క‌లిసి తీసిన ల‌ఫ్ఫాంగిరిగిట్ట సినిమాకి రివ్యూ ఇచ్చే క్ర‌మంలో సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందో అని అడిగాడు నాని. దీనికి స్పందించిన రోల్ రైడా త‌న ఇంటి ద‌గ్గ‌ర గల్లీలో దోస్త్‌లు ముందు గొడ‌వ ప‌డి త‌ర్వాత క‌లిసిపోతారు అప్పుడు ల‌ఫ్ఫాంగిరిగిట్టా అని అంటాం. ఇప్పుడు ఈ సినిమా క‌థ కూడా అలానే ఉండ‌డంతో ఇదే క‌రెక్ట్ టైటిల్ అని భావించి సినిమాకి ఆ పేరు పెట్టాం అని రోల్ రైడా చెప్పుకొచ్చాడు. సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు రియ‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. టాస్క్‌లా కాకుండా నిజంగా షూటింగ్ జ‌రిగిన‌ట్టే అంద‌రు టెక్నీషియ‌న్స్ క‌సితో ప‌నిచేయ‌డం బాగుంది. ఐటెం సాంగ్‌, రోల్ కెమెరా పనితనం, తేజూ కొరియోగ్ర‌ఫీ, హీరోల ప‌ర్‌ఫార్మెన్స్‌, విల‌నిజం, హీరోయిన్ లో షేడ్స్, అమిత్ ద‌ర్శ‌క‌త్వం అంతా బాగుంద‌ని నాని ప్ర‌శంసించారు . ఇక ఓవరాల్ పెర్ఫామెన్స్ బట్టి ఈ సినిమాకు ‘సకుటుంబ సపరివార సమేత’ మూవీగా 4/5 సూపర్ రేటింగ్ ఇచ్చారు నాని.

బిగ్ బాస్ సీజ‌న్ 2 ఇక్కడ ఏదైన జ‌ర‌గొచ్చు. అస్స‌లు ఊహించ‌ని ఇంటి స‌భ్యుల‌లో ఒకరు నేడు బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ కానున్నారు. మొత్తం ఎలిమినేష‌న్ కోసం దీప్తి, తేజ‌స్వీ, రోల్ రైడా, సామ్రాట్‌, త‌నీష్‌లు నామినేట్ కాగా రోల్, త‌నీష్‌, యాంక‌ర్ దీప్తిలు ప్రొటెక్టెడ్ జోన్‌లో ఉన్న‌ట్టు నాని ప్ర‌క‌టించారు. ఇక హౌజ్‌లో ల‌వ్ బ‌ర్డ్స్‌గా ఉన్న సామ్రాట్‌, తేజ‌స్వీలు ఇప్పుడు విడిపోయే స‌మ‌యం వచ్చింది.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం హౌజ్ నుండి సామ్రాట్ ఎలిమినేట్ అవుతాడ‌ని అంటున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే రొమాంటిక్ జోడికి బిగ్ బాస్ పెద్ద బ్రేక్ వేసిన‌ట్టే. మ‌రి నేటి ఎపిసోడ్‌లో నాని ఎవ‌రిని ఎలిమినేట‌ర్‌గా ప్ర‌క‌టిస్తారో తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.

2886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles