నానిపై ట్రోలింగ్.. స్పందించిన నేచురల్ స్టార్

Tue,September 4, 2018 03:39 PM
nani gives clarity on bissboss issues

వెండితెరపై నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాడు. మరి కొద్ది రోజులలో ఈ సీజన్ ముగియనుంది. 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. అయితే ప్రతీ వారం ఒక్కో సభ్యుడు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతుండగా, గత వారంలో మాత్రం శనివారం ఒకరు, ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయ్యారు.

ఆదివారం నూతన్ నాయుడు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ కావడంతో ఆయన అభిమానులు నానిపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. పక్షపాత ధోరణితో నాని వ్యవహరిస్తున్నారని ఆయనని ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేశారు. దీనిపై పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు నాని. బిగ్ బాస్ గురించి మీరు చేసిన కామెంట్స్ చూశాను. దీనికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ నిర్వాహకులు తెలిపారు. కాని ఇవ్వకుండా ఎలా ఉండగలను. బిగ్ బాస్ షోకి సంబంధించి ఇదే నా చివరి ట్వీట్ అంటూ పోస్ట్ పెట్టారు నాని.

షో విషయంలో మీలో కొందరు నా వలన బాధపడి ఉంటే క్షమించండి. కాని మీరందరు మీ కోణంలో చూస్తున్నారు. మీకు ఇష్టమైన హౌజ్ మేట్ ని ఎప్పుడూ ప్రత్యేకంగా చూసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఓ హోస్ట్గా మీలా నేను ఆలోచించలేను. అందరి విషయంలో న్యూట్రల్ గా ఉంటాను. ఎందుకంటే మీరు హౌస్లో ఒకరికి అభిమానై ఉంటారు కాబట్టి నేను అందరికీ సమానమైన అవకాశం ఇస్తున్నప్పుడు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాను అనిపించొచ్చు. కానీ నన్ను నమ్మండి.

హౌజ్ లో ప్రతి ఒక్కరు నాకు సమానమే. మనందరికి తెలుసు . మీ ఆదరణతో ఎవరైతే చివరి వరకు ఉంటారో వారే గెలుస్తారని. ఓటింగ్, ఎలిమినేషన్ విషయంలో నా అభిప్రాయం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇక దాన్ని మీకే వదిలేస్తున్నా . ఓ నటుడిగా, వ్యాఖ్యాతగా మీకు ది బెస్ట్ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. ఈ విషయంలో నా ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయి. మీరు నన్ను ద్వేషించినా, ప్రేమించినా మీరంతా నాకు కొత్తగా ఏర్పడ్డ కుటుంబ సభ్యులే. మీరు నన్ను అపార్థం చేసుకుంటే దాని ప్రభావం నాపై ఉంటుంది. కానీ అది నన్ను కిందకి పడేస్తుందా? లేదు.. ఇంకా ఉత్తమంగా చేసేందుకు ప్రయత్నిస్తా. లవ్.. నాని’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. నాని నటించిన దేవదాస్ త్వరలోనే విడుదల కానుండగా, జర్సీ చిత్రం షూటింగ్ దశలో ఉంది.


3269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles