త‌మిళ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న నాని

Thu,May 24, 2018 09:14 AM
nani enter into kollywood again

వ‌రుస విజ‌యాల‌తో వెండితెర‌పై సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన నాని త్వ‌ర‌లో బుల్లితెర‌కు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. బిగ్ బాస్ 2 షో ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని కూడా అల‌రించ‌నున్నాడు. ఇటీవ‌ల కృష్ణార్జున యుద్ధం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నాని ప్ర‌స్తుతం నాగ్‌తో క‌లిసి శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్నాడు. జూలైలో ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఓ త‌మిళ సినిమా కూడా చేస్తున్న‌ట్టు స‌మాచారం. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో వేల‌న్ ఎట్టుత్తిక్కుమ్ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న‌ చిత్రంలో నాని ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న సంచ‌ల‌న న‌టి అమ‌లాపాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శ‌ర‌త్ కుమార్, నాజర్, చిత్రలక్ష్మణన్, శివబాలాజి, పార్వతీమీనన్, నాగిని త్రివేది త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

గ‌తంలో వెప్పం అనే చిత్రంతో త‌మిళ ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన నాని ఇప్పుడు వేల‌న్ ఎట్టుత్తిక్కుమ్ చిత్రంతో మ‌రోసారి అల‌రించ‌నున్నాడు. ఈ రోజుల్లో అవినీతి, లంచం వంటి అక్రమాలు జరగని దేశమే లేదు. అదే విధంగా ఎంత పెద్ద నేరానికి అయినా ఒక రేటును నిర్ణయింపబడుతోంది. నేరస్తులు నిరపరాధులుగా, నిరపరాధులు నేరస్తులు గానూ మార్చబడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి అరవింద్‌ అనే యువకుడి చేసిన పోరాటమే వేలన్‌ ఎట్టుత్తిక్కుమ్‌ చిత్రం అని నిర్మాత తెలియ‌జేశారు. సామాజిక సందేశంతో కూడిన యాక్ష‌న్ చిత్రంగా ఈ మూవీ రూపొందుతుండ‌గా, చిత్రానికి జీవీ ప్రకాశ్ బాణీలు అందిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

2243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles