న‌టుడిగా ద‌శాబ్ధం పూర్తి చేసుకున్న నాని

Wed,September 5, 2018 10:21 AM
nani completes decade

ప‌క్కింటి అబ్బాయిలా ఎంతో నేచుర‌ల్‌గా క‌నిపించే నేచుర‌ల్ స్టార్ నాని. ఆర్జేగా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరియ‌ర్ మొద‌లు పెట్టిన నాని 2008 సంవ‌త్స‌రంలో అష్టా చెమ్మా అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేశాడు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌డంతో నానికి త‌ర్వాత మంచి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. 2009 నుండి 2011 సంవ‌త్స‌రం మ‌ధ్య ఐదారు సినిమాలు చేసిన నానికి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భించ‌లేదు. 2012లో వ‌చ్చిన ఈగ చిత్రం నాని రాత‌ని మార్చేసింది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈగ చిత్రంలో చేసింది కొద్ది సేపే అయిన మ‌నోడికి మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు నానిని కాస్త డిప్రెష‌న్‌లోకి నెట్టాయి.

2015లో మారుతి తెర‌కెక్కించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు నాని. మ‌తిమ‌రుపు గ‌ల వ్య‌క్తిగా ఫుల్ కామెడీని జ‌న‌రేట్ చేశాడు నాని. ఈ చిత్రం ప్రేక్ష‌కులని క‌డుపుబ్బ న‌వ్వించేలా చేసింది. ఇక ఆ త‌ర్వాత నాని డ‌బుల్ హ్యాట్రిక్ విజ‌యాలు సాధించి టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం దేవ‌దాస్ అనే చిత్రంలో నాగ్‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక జ‌ర్సీ అనే చిత్రంతోను బిజీగా ఉన్నాడు నేచుర‌ల్ స్టార్‌. అయితే వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పైన త‌ను అల‌రించ‌గ‌ల‌న‌ని బిగ్ బాస్ 2 కార్య‌క్ర‌మంలో ప్రూవ్ చేశాడు నాని. బిగ్ బాస్ 2కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాని త‌న‌దైన పంచ్‌ల‌తో జిమ్మిక్కులు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్న నాని కెరీర్‌లో మ‌రెన్నో మంచి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తార‌ని కోరుకుందాం.

1709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles