టీఆర్‌పీ రేటింగ్‌లో అద‌ర‌గొడుతున్న బిగ్ బాస్ 2

Thu,June 21, 2018 01:27 PM
Nani bigg boss2 Tops The TRP Rating

బుల్లితెర‌పై క్రేజీ టీవీ షోగా మారిన రియాలిటీ షో బిగ్ బాస్. తొలి సీజ‌న్ ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌గా, రెండో సీజ‌న్‌ను నాని హోస్ట్‌ చేస్తున్నాడు. 16మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభ‌మైన రెండో సీజ‌న్‌లో తొలి ఎలిమినేట‌ర్‌గా సంజన బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది. లాంచింగ్ రోజు( జూన్ 10)న‌ సంద‌డి చేసిన నాని మ‌ళ్లీ జూన్ 16,17 తేదీల‌లో బుల్లితెర‌పై క‌నిపించి హ‌డావిడి చేశాడు. అయితే సీజ‌న్‌2కి మిక్స్ డ్ టాక్ ల‌భిస్తున్న క్ర‌మంలో తొలి వారం ఈ కార్య‌క్ర‌మం అద్భుత టీఆర్‌పీ రేటింగ్ సాధించి టాప్ వ‌న్‌లో నిలిచింది. బీఏఆర్సీ లెక్క‌ల ప్ర‌కారం సీజ‌న్ 2 లాంచింగ్ ఎపిసోడ్‌కి టీఆర్పీ రేటింగ్‌ 15.05 రాగా, వీక్ డేస్‌లో 7.93గా న‌మోదైంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ లాంచింగ్ ఎపిసోడ్‌కి 16.18 టీఆర్పీ రేటు సాధించింది. తొలి వారంలో 9.24 రేటింగ్ న‌మోదైంది. ఈ లెక్క‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే సీజ‌న్ 1కే ఎక్క‌వ ఆద‌ర‌ణ ల‌భించిన‌ట్టు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ కార్య‌క్ర‌మం టెలికాస్ట్ చేస్తున్న ప్ర‌ముఖ‌ ఛానెల్ తొలి సారి 850 జీఆర్‌పీ (గ్రాస్ రేటింగ్ పాయింట్) సాధించిందట‌. ఇంత వరకు ఎప్పుడూ ఈ జీఆర్పీని ఆ ఛానెల్ అందుకోలేద‌ని తెలుస్తున్నది. రానున్న రోజుల‌లో నాని త‌న టాలెంట్‌తో బిగ్ బాస్ 2 షోని ఇంకా ఏ స్థాయికి తీసుకెళ‌తాడో చూడాలి.

3354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS