మారుతి-నాని కాంబినేషన్‌లో మ‌రో చిత్రం..!

Thu,January 31, 2019 10:53 AM

నాని- మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కామెడీ ఎంట‌ర్‌టైనర్ భ‌లే భలే మ‌గాడివోయ్. 2015లో తెర‌కెక్కిన ఈ చిత్రం నాని కెరీర్‌నే పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా త‌ర్వాత నాని వ‌రుస విజ‌యాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నాని- మారుతి కాంబినేష‌న్ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని కూడా చెబుతున్నారు. ప్ర‌స్తుతం నాని మ‌ళ్లీ రావా ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో జెర్సీ అనే చిత్రం చేస్తున్నాడు. క్రీడా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు నాని. ఈ సినిమాతో పాటుగా మారుతి సినిమా కూడా నాని చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు మారుతి.. అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని గ‌తంలో ప‌లు వార్తలు రాగా, దీనిపై ఇంత వ‌ర‌కు క్లారిటీ లేదు.

1605
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles