నాని చిత్రానికి 'ట‌క్ జ‌గ‌దీష్' టైటిల్‌

Tue,December 3, 2019 10:36 AM

నేచుర‌ల్ స్టార్ నాని విభిన్న పాత్ర‌ల‌తో ప్రేక్షకుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రిగా జెర్సీ చిత్రంలో క్రికెట‌ర్‌గా అల‌రించిన నాని, ఆ త‌ర్వాత గ్యాంగ్ లీడ‌ర్‌గా మెప్పించాడు. ఇక ఈ సారి కాస్త వినూత్న పాత్ర‌లో క‌నువిందు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. త‌న 26వ చిత్రాన్ని నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు నాని. ఈ చిత్రానికి ట‌క్ జ‌గ‌దీష్ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.


ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం త‌ల్లి- కొడుకుల నేప‌థ్యంలో సాగ‌నుండ‌గా, ఇందులో నానికి ఆరుగురు సోద‌రులు ఉంటార‌ట‌. ఈ చిత్రంలో నాని ట‌క్ జ‌గ‌దీష్‌గా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తాడ‌ని చెబుతున్నారు. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌వూస్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని జనవరిలో సెట్స్‌మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles