జై లవకుశలోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్!

Fri,April 21, 2017 11:28 AM
nanditha plays key role in jai lavakusa

ప్రేమ కథా చిత్రంలో దెయ్యంగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన నటి నందిత రాజ్. ఈ అమ్మడు బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జై లవకుశలో నటిస్తుందనే వార్త ఇప్పుడు దావానంలా పాకింది. ఇందులో నందిత పాత్ర చాలా చిన్నదే అయినప్పటికి సినిమాకి చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ అమ్మడికి సంబంధించిన విషయాన్ని రివీల్ చేయకుండా గోప్యంగా ఉంచారనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే నందిత రోల్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందని అంటున్నారు. జై లవకుశ చిత్ర యూనిట్ త్వరలో లాంగ్ షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్ళనుంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. నందమూరి ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేదా థామస్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ గార్ట్ వెల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. ఆగస్ట్ రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

1368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles